టీకప్పులపై ‘మైభీ చౌకీదార్‌’..!
Spread the love

న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన ‘మైభీ చౌకీదార్‌’. నినాదం టీకప్పులపై వెలిసింది. ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తూ మైభీ చౌకీదార్‌ పేరుతో ఉన్న కప్పుల్లో ప్రయాణికులకు తేనీరు అందిస్తున్నారు. ఈ వ్యవహారం కాత్‌గోడమ్‌-శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లో వెలుగుచూసింది.  ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైనా రైలు టికెట్లపై మోదీ ఫొటోతో ఉన్న టికెట్లు జారీ చేయడంపై ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేసిన ఈసీ తాజా ఘటనపై ఏ చర్యలు తీసుకుంటుందో చూడాలి. ఇక టీకప్పుల వ్యవహారంపై విచారణ చేపట్టామని ఐఆర్‌సీటీపై ప్రతినిధి తెలిపారు. సర్వీస్‌ కాంట్రాక్టర్‌కు లక్ష రూపాల జరిమానా విధించామని, షోకాజ్‌ నోటీసులు కూడా జారీ చేశామని చెప్పారు. సంకల్ప్‌ ఫౌండేషన్‌ అనే స్వచ్ఛంద సంస్థ ఈ కప్పుల్లో తేనీరును అందించినట్టు తెలిసింది.