సీఎం సతీమణి డ్యాన్సింగ్ టాలెంట్ అదుర్స్…
Spread the love

మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సతీమణి అమృత డ్యాన్సింగ్ టాలెంట్‌తో అదరగొట్టారు. కుమార్తెతో కలిసి బాలీవుడ్ మూవీ బాజీరావ్ మస్తానీ సినిమాలోని పాటకు అదిరిపోయే స్టెప్పులతో ఫిదా చేశారు. ఈ వీడియోను అమృత తన సోషల్ మీడియా అకౌంట్లలో పోస్ట్ చేశారు. తన కూతురితో కలిసి డ్యాన్స్ చేయడం ఎంతో జోష్ ఇచ్చిందంటూ నెటిజన్లతో తన ఆనందాన్ని పంచుకున్నారు. అమృత తన బంధువుల వివాహానికి హాజరయ్యారట. అక్కడ జరిగిన సంగీత్‌లో తన డ్యాన్స్‌తో ఆకట్టుకున్నారు. తన కుమార్తె దివిజతో.. అది కూడా ఒకే కలర్ డ్రెస్సులో మెరిశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. ముఖ్యమంత్రి గారి సతీమణి డ్యాన్సింగ్ టాలెంట్ అదుర్స్ అంటూ నెటిజన్లు కూడా ఫిదా అవుతున్నారు.

#Loved to perform a dance medley along with my heartbeat #divija at Family Wedding Sangeet ! ‘Together’ is a wonderful place to be ! #motherdaughter #motherdaughtergoals #familybonding #motherdaughterbond #motherdaughterlove #dance

Posted by Amruta Fadnavis on Saturday, 29 December 2018