ఇండియన్ ఫైటర్ జెట్ తో పోటీ పడిన లాంబోర్గిని కారు…
Spread the love

ఒక వైపు భారత నావికాదళంలో అత్యంత కీలకమైన యుద్ధ విమానం MIG-29K,మరొక వైపు ఇటలీ లగ్జరీ కార్ మేకర్ “లాంబోర్గినీ” కారుఈ రెండు రన్ వే మీద ఒకదానితో మరొకటి పోటీపడ్డాయి.లాంబోర్గినీ కార్ జెట్ తో పాటు సమానవేగంతో దూసుకెళ్లడానికి ప్రయత్నించింది.ఈ సంఘటన గోవాలోని దంబోలిన్ విమానాశ్రయంలో జరిగింది. ఈ పోటి లో కారు కన్నా వేగంగా జెట్ వెళ్లి గాల్లోకి ఎగిరిపోయింది.

ఈ వీడియోను ‘ఆటో వరల్డ్’ మేగజైన్ కోసం షూట్ చేశారు.భారత నావికాదళంలో చేరాలనే బలమైన కోరిక యువత మనస్సులో ఏర్పడేలా ఉంటుందని నేవీ అధికారులు ఈ వీడియో షూట్ చెయ్యడానికి అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా తీసిన చిత్రాలు తదుపరి విడుదల కాబోయే’ఆటో వరల్డ్’ మేగజైన్ లో ప్రచురితమవుతాయి.దానికన్నా ముందుగానే ఈ వీడియో సోషల్ మీడియా లో హాల్ చల్ చేస్తుంది.జెట్ విమానంతో పోటీపడుతున్న లాంబోర్గినీ కారు వీడియో మీరూ చూడండి….