క్రిష్ బర్త్ డే సందర్భంగా ‘ఎన్టీఆర్’ నుంచి కొత్త లుక్
Spread the love

క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ‘ఎన్టీఆర్’ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని రెండు భాగాలుగా క్రిష్ తెరకెక్కిస్తున్నారు. నటరత్న నందమూరి బాలకృష్ణ హీరోగా.. నిర్మాతగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి బర్త్ డే సందర్భంగా ఆయనకు విషెస్ చెబుతూ కొన్ని పిక్స్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ‘ఓ చరిత్రకు తెరతీస్తున్న శుభదినాన జరుపుకుంటున్న జన్మదినం.. యుగ పురుషుడితో సాగుతున్న ఈ ప్రయాణం..’ అంటూ చిత్రబృందం క్రిష్‌కి బర్త్ డే విషెస్ చెప్పింది. ప్రస్తుతం బొబ్బిలిపులి చిత్రానికి సంబంధించిన సన్నివేశాలను తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రంలోని ఓ భారీ డైలాగ్‌ను సింగిల్ టేక్‌లో చెప్పి బాలయ్య.. ఎన్టీఆర్‌ను గుర్తు చేశారట. మొత్తానికి అలనాటి ఎన్టీఆర్ డైలాగ్స్‌ని బాలకృష్ణ తనదైన శైలిలో చెప్పుబోతున్నాడన్న మాట.