నిధి అగర్వాల్‌ తో డేటింగ్ చేస్తున్న క్రికెటర్ కేఎల్‌ రాహుల్‌..!
Spread the love

క్రికెటర్లతో బాలీవుడ్‌ తారల మధ్య ప్రేమాయణం గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ఐదు సంవత్సరాలుగా ప్రేమలో ఉన్న కోహ్లీ-అనుష్కలు గత ఏడాది పెళ్లి బంధంతో ఒకటయ్యారు. ఇప్పుడు తాజాగా మరో జంట గురించి ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చర్చ జరుగుతోంది.

ఇంతకీ వారిద్దరూ ఎవరు అంటే.. ఐపీఎల్‌లో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌కు ప్రాతినిధ్యం వహించిన కేఎల్‌ రాహుల్‌.  బాలీవుడ్‌ తార నిధి అగర్వాల్‌. ఈమె ప్రస్తుతం తెలుగులో ఓ సినిమా కూడా చేస్తోంది. చందు మొండేటి దర్శకత్వంలో నాగ చైతన్య ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న సవ్యసాచి చిత్రంలో నిధి అగర్వాల్‌ కథానాయిక. కొద్ది రోజుల క్రితం వీరిద్దరూ ముంబయిలోని బాంద్రా ప్రాంతంలో జంటగా కనిపించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై ఇప్పటి వరకు ఎవరి నుంచి ఎలాంటి స్పందన లేదు.

ఇదిలా ఉంటే దేశ వ్యాప్తంగా సోషల్ మీడియాలో ‘మనం ఫిట్‌గా ఉండే ఇండియా ఫిట్‌గా ఉంటుంది’ అనే ఛాలెంజ్ వైరల్ అవుతోంది. ఇందులో భాగంగా ఫిట్‌నెస్ ఛాలెంజ్ స్వీకరించడం, మరో ముగ్గురిని ఛాలెంజ్ చేయడం లాంటివి చేస్తున్నారు. తాజాగా హీరో నాగ చైతన్య ఈ ఫిట్‌నెస్ ఛాలెంజ్ తన తమ్ముడు అఖిల్ నుండి స్వీకరించడంతో పాటు సమంత, సుశాంత్, తను నటిస్తున్న సవ్యసాచి మూవీ హీరోయిన్ నిధి అగర్వాల్‌ను ఛాలెంజ్ చేశారు.

నాగ చైతన్య నుండి ఫిట్‌నెస్ ఛాలెంజ్ స్వీకరించిన నిధి అగర్వాల్….. జిమ్‌లో క్లీవేజ్ షో చేస్తూ హాట్ హాట్ అందాలతో చైతూ ఛాలెంజ్‌కు బదులిచ్చింది. ఇది తన ఫేవరెట్ ఎక్సర్‌సైజ్ అని పేర్కొన్నారు. ఆమె పోస్టు చేసిన వీడియో హాట్ హాట్‌గా ఉండటంతో సోషల్ మీడియాలో వైరల్ అయింది.అనంతరం నాగ చైతన్య ఫిట్‌నెస్ ఛాలెంజ్‌ను విజయవంతంగా పూర్తి చేయడంతో పాటు బాలీవుడ్ నటుడు ఆర్యన్ కార్తీక్, జాకీష్రాఫ్ కూతురు కృష్ణ ష్రాఫ్ పాటు టీమిండియా క్రికెటర్ కెఎల్ రాహుల్‌కు ఛాలెంజ్ విసిరింది. అలా నిధి అగర్వాల్ ఛాలెంజ్ విసిరిందో లేదో… వెంటనే కేఎల్ రాహుల్ జిమ్‌లో కసరత్తులు చేస్తోన్న వీడియోని ట్విట్టర్‌లో అభిమానులతో పంచుకున్నాడు.