గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో కౌశల్
Spread the love

బిగ్ బాస్ సీజన్ 2 విన్నర్ కౌశల్ క్రేజ్ అంతకంతకు పెరుగుతూనే ఉంది. తనకంటూ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను పొందిన కౌశల్ విజేతగా నిలిచిన తర్వాత కూడా చాలా విశేష స్పందన పొందుతున్నాడు. కౌశల్ విజయంలో కౌశల్ ఆర్మీ కీలక పాత్ర పోషించారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.బిగ్ బాస్ చరిత్రలోనే ఎప్పుడు కంటెస్టెంట్ కు కూడా దక్కని ఓట్లు కౌశల్ కు దక్కాయి.

తాజాగా తనకు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వారి నుండి నాకు కాల్ వచ్చిందనిబిగ్ బాస్ తో పాటు ఇతర రియాల్టీ షోల్లో అప్పటి వరకు ఒక్కరికి రానన్ని ఓట్లు మీకు వచ్చిన కారణంగా మీ పేరును గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చేర్చుతున్నట్లుగా చెప్పారు అంటూ స్వయంగా కౌశల్ ప్రకటించాడు. అతి త్వరలోనే గిన్నీస్ బుక్ వారు విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తామని తనతో అన్నారని కౌశల్ చెప్పుకొచ్చాడు.అదే సమయంలో రామ్ చరణ్ మూవీలో మీరు నటించబోతున్నారా అంటూ ప్రశ్నించగా  రామ్ చరణ్ ,బోయపాటిల చిత్రంలో ఛాన్స్ వచ్చిన మాట వాస్తవమే కానిఇంకా ఒప్పందం చేసుకోలేదని  త్వరలోనే అది జరిగే అవకాశం ఉందని తర్వాత నేనే ప్రకటిస్తాను అంటూ కౌశల్ చెప్పుకొచ్చాడు.