కశ్మీరీలపై యూపీలో దాడులు !
Spread the love

యూపీలో ఇద్దరు కశ్మీరీలపై కొందరు దాడికి పాల్పడటం కలకలం రేపింది. లక్నోలో డ్రైఫ్రూట్స్‌ అమ్మే ఇద్దరు కశ్మీరీలపై హిందూ అతివాద సంస్ఠ కు చెందిన కొందరు బుధవారం దాడి చేశారు. బాధితులు వీధి వ్యాపారం చేసుకుంటూ జీవిస్తున్నారు. కాగా వీరిని వేధింపులకు గురిచేసిన వారిలో ఓ వ్యక్తి దాడికి సంబంధించిన వీడియోను షేర్‌ చేయడంతో ఈ ఉదంతం వెలుగుచూసింది. వారు కశ్మీర్‌కు చెందిన వారు కావడంతోనే చితకబాదుతున్నామని దాడికి పాల్పడిన వ్యక్తి చెబుతుండటం గమనార్హం.

ఈ ఘటనను చూసిన స్ధానికులు కశ్మీరీలను కాపాడి, దాడికి పాల్పడే వ్యక్తిని అడ్డుకున్నారు. కశ్మీరీలపై దాడి చేసిన ప్రధాన నిందితుడు విశ్వ హిందూ దళ్‌ అధ్యక్షుడిగా గుర్తించారు.దాడి ఘటనపై కేసు నమోదు చేశామని ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు చెప్పారు.కాగా ఇప్పటివరకూ ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్ట్‌ చేయలేదు.