వదినా మరిది కాదు.. అక్కా తమ్ముడు
Spread the love

కార్తీ, జ్యోతిక వరుసకు వదినా, మరిది. అంటే సూర్యకు తమ్ముడు. కానీ జ్యోతికకు తమ్ముడిగా మారనున్నారట కార్తీ.  మలయాళ దర్శకుడు జీతు జోసెఫ్‌ తమిళంలో ఓ ఫ్యామిలీ డ్రామా తెరకెక్కించనున్నారు. ఈ సినిమా కోసం అక్క, తమ్ముడు పాత్రల కోసం జ్యోతిక, కార్తీలను ఒప్పించారు. పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎమోషన్స్‌తో సాగే కథ అని సమాచారం. ప్రస్తుతం ఇతర సినిమాలతో బిజీగా ఉన్నారు జ్యోతిక, కార్తీ. వాళ్ల కమిట్‌మెంట్స్‌ పూర్తికాగానే జూన్‌లో ఈ సినిమా షూటింగ్‌లో జాయిన్‌ అవుతారట. ఇందులో మిగతా నటీనటులు ఎవరో ఇంకా తెలియదు. కార్తీ, జ్యోతిక ఇద్దరూ తెలుగు ఆడియన్స్‌కు సుపరిచితమే కాబట్టి డబ్బింగ్‌ చేసి ఇక్కడ కూడా రిలీజ్‌ చేస్తారేమో చూడాలి.