లేటు వయసులో పరుగుపందెం…..కిందపడ్డ మంత్రి
Spread the love

కర్ణాటక రాష్ట్రంలో ఓ మంత్రి పరుగుపందెం సమయంలో అదుపు తప్పి కిందపడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. దసరా ఉత్సవాల సందర్భంగా మైసూరులో నిర్వహించిన మారథాన్లో ఈ అపశ్రుతి చోటుచేసుకుంది.మారథన్లో పాల్గొన్న మంత్రి జీటీ దేవేగౌడ పరుగు తీస్తూ అనుకోకుండా కిందపడ్డారు. దసరా నవరాత్రులను పురస్కరించుకుని మైసూరులోని ఓ స్వచ్ఛంద సంస్థ ఈ మారథాన్ను నిర్వహించింది. దీనికి మంత్రి ముఖ్య అతిథిగా వచ్చారు.కొంత దూరం వెళ్లాక సదరు మంత్రి జీటీ దేవేగౌడ ఒక్కసారిగా కిందపడిపోయాడు. భద్రతా సిబ్బంది, మీడియా ప్రతినిధులు మంత్రిని పైకి లేపి ప్రథమ చికిత్స నిర్వహించి స్థానిక ఆస్పత్రికి తరలించారు. మంత్రి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించినట్టు సమాచారం.