సౌందర్య జ్ఞాపకార్థం పాఠశాల
Spread the love

బెంగళూరు,యశవంతపుర: బహుబాషా నటి సౌందర్య విమాన ప్రమాదంలో శాశ్వతంగా దూరమై 15 ఏళ్లు. ఆమె నటనా ప్రతిభా పటిమ సజీవంగా ఉంది.ఆమె జన్మించిన ఊరు కోలారు జిల్లా బంగారుపేట తాలూ కా గంజిగుంట గ్రామంలో ప్రభుత్వ పాఠశాల ఆమె జ్ణాపకార్థం తరగతి గదులను నిర్మించింది.  సత్యనారాయణ, మంజుళ దంపతులకు జన్మించిన ఆమె అసలు పేరు సౌమ్య. ఒకటవ తరగతి నుండి గంజిగుంట గ్రామంలోనే చదివారు.

బెంగళూరుకు వచ్చి 16 ఏళ్ల పాటు సినిమా రంగంలో ఉంటూ కన్నడ, తమిళ, తెలుగు బాషల్లో 107 సినిమాలలో నటించారు. చిన్న వయస్సు నుండి సంగీతం, నాట్యం, నాటకాలపై అసక్తిని పెంచుకోని సినిమా రంగంలోకి వచ్చి తనదైన గుర్తింపును తెచ్చుకున్నారు. తమిళ నటుడు రజనీకాంత్, తెలుగు నటుడు చిరంజీవి, కన్నడ నటుడు రవీచంద్రన్‌ సరసన నటించారు. 2004 ఏప్రిల్‌ 17న తన సోదరుడు అమరనాథ్‌తో కలిసి ఎన్నికల ప్రచార నిమిత్తం ప్రత్యేక విమానంలో  జక్కూరు విమానాశ్రయం నుంచి బయల్దేరిన కొన్ని క్షణాలకే విమానం కూలి మరణించారు.