డేరింగ్ డెసిషన్ తీసుకున్న కంగనా
Spread the love

మోస్ట్ టాలెంటెడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ ప్రస్తుతం చేస్తున్న చిత్రం ‘మణికర్ణిక’. ఝాన్సీ రాణి లక్ష్మీబాయి జీవితం ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ చాలా వరకు ముగిసింది. కానీ కొంతమేర ప్యాచ్ వర్క్ మాత్రం చాలా రోజులుగా అలానే మిగిలిపోయి ఉంది. అందుకు కారణం ఆ చిత్ర దర్శకుడు క్రిష్. ప్రస్తుతం క్రిష్ విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ‘ఎన్టీఆర్’ సినిమాకు దర్శకుడిగా నియమితులు కావడమే. ప్రస్తుతం తన పూర్తి సమయాన్ని ఎన్టీఆర్ సినిమా మీదే వెచ్చిస్తున్న క్రిష్ ‘మణికర్ణిక’ చిత్రాన్ని పట్టించుకోలేకపోతున్నారు. దీంతో క్రిష్ కోసం ఇన్నాళ్లు ఎదురుచూసిన కంగనా ఇక లాభం లేదనుకుని దర్శకత్వ భాద్యతను స్వయంగా భుజానికెత్తుకున్నారు. రచయితలు, దర్శకత్వ విభాగం సహాయంతో మిగిలిన ప్యాచ్ వర్క్ పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారు. మొదలుపెట్టిన సినిమాను ఎలాగైనా పూర్తి చేయడం కోసం కంగనా తీసుకున్న ఈ డేరింగ్ డెసిషన్ నిజంగా అభినందనీయం.