నేటి తరం కోసం  పోరాడుతున్న నటి జ్యోతిక
Spread the love

నటి జ్యోతిక స్కూల్‌ టీచర్‌గా మారారు. విద్యార్థులకు పాఠాలు చెప్పడంతోనే తన బాధ్యత పూర్తి అయ్యిందనుకోలేదు. విద్యా వ్యవస్థలోని లోపాలను సరిచేయాలని పోరాటం మొదలుపెట్టారు. మరి.. ఆమె పోరాటం ఫలించిందా? అనే విషయాన్ని వెండితెరపై చూసి తెలుసుకోవాల్సిందే.ఈ సినిమాతో ఎస్‌. రాజ్‌ దర్శకునిగా పరిచయం కాబోతున్నారు. ఇందులో జ్యోతిక స్కూల్‌ టీచర్‌గా నటిస్తున్నారని తెలిసింది.

ఈ సినిమాలో పాత్ర పరంగా విద్యా వ్యవస్థలోని లోటుపాట్లపై ఆమె పోరాటం చేస్తారట. 2003లో వచ్చిన ‘కాక్క కాక్క’ తర్వాత జ్యోతిక టీచర్‌గా నటిస్తున్నది ఇప్పుడే కావడం విశేషం. ఈ చిత్రానికి ‘రాక్షసి’ అనే టైటిల్‌ అనుకుంటున్నారని తెలిసింది. ఈ సినిమా సంగతి ఇలా ఉంచితే… ‘గులేబకావళి’ ఫేమ్‌ కల్యాణ్‌ దర్శకత్వంలో జ్యోతిక, రేవతి ముఖ్య పాత్రధారులుగా ఓ సినిమా తెరకెక్కనుంది. వేసవిలో ఈ చిత్రం సెట్స్‌పైకి వెళుతుందట