పవన్ కళ్యాణ్ డైలాగ్ చెప్పిన ఎన్టీఆర్!
Spread the love

మెగా హీరోల నోట నందమూరి కథానాయకుల గురించి ఏవైనా మాటలు వినిపించినా.. అలాగే నందమూరి హీరోలు మెగా హీరోల ప్రస్తావన తెచ్చినా అందరిలోనూ ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. ఇక అవతలి హీరో సినిమాలోని డైలాగ్.. ఇవతలి హీరో నోట వినిపిస్తే ఇక జనాల్లో ఎంత క్యూరియాసిటీ ఉంటుందో చెప్పేదేముంది?. జూనియర్ ఎన్టీఆర్.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డైలాగ్ పలికి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ‘కంటికి కనిపించని శత్రువుతో బయటకు కనపడని యుద్ధం చేసేవాడిని’ – ‘అత్తారింటికి దారేది’ క్లైమాక్స్‌లో పవన్‌కల్యాణ్‌ చెప్పిన ఎమోషనల్‌ డైలాగ్‌. ఆదివారం జరిగిన ‘అరవింద సమేత వీరరాఘవ’ సక్సెస్‌మీట్‌లో ఎన్టీఆర్‌ ఇదే డైలాగ్‌ చెప్పారు. త్రివిక్రమ్‌ పరిస్థితి వివరించడానికి ఈ డైలాగ్‌ ఉపయోగించారు. ఈ చిత్రం మొదలు కాకముందు త్రివిక్రమ్‌ రెండు కథలు చెప్పారు. కానీ ఆయనకు అవి సరిపోలేదు. మిత్రుడు, నాకు తెలిసిన వ్యక్తి కాబట్టి ఆయన ఫీలింగ్స్‌ నాకు తెలుసు.. ఈ కథ కోసం తనలో తాను ఓ యుద్ధం చేశారు. తర్వాత వచ్చి 20 నిమిషాలు ఈ కథ చెప్పారు. ముందు రెండు కథలు చెప్పినప్పుడు ఆయన కళ్లల్లో కనిపించని ఆ మెరుపును ఈ సినిమా కథ చెబుతున్నప్పుడు చూశా. నేను త్రివిక్రమ్‌ నుంచి ఎలాంటి ఎమోషన్‌ను కోరుకున్నానో.. అదే ఎమోషన్‌తో ఉన్న కథను ఆయన నాకు వచ్చి చెప్పారు” అని అన్నారు ఎన్టీఆర్.