జనసేనలో చేరిన  JD లక్ష్మి నారాయణ !
Spread the love

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో CBI మాజీ JD లక్ష్మి నారాయణ చేరడం జనసేనలో చేరారు. లక్ష్మి నారాయణ సొంత పార్టీని పెడతారని అంత భావించారు. ఆ తర్వాత ఆయన లోక్ సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ తో కలిసి హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టడంతో ఆయన లోక్ సత్తా లో జాయిన్ అవ్వడం ఖాయం అని అనుకున్నారు. ఆ ఆలోచనకు కూడ ఆయన విరమించుకున్నారు. ఆయన TDP లో చేరుతారు అనే ఊహాగానలు బలంగా వినిపించాయి. కానీ లక్ష్మి నారాయణ జనసేనలో చేరాడు.

ఈ సందర్బంగా లక్ష్మి నారాయణ మాట్లాడుతూ “రాజకీయాలల్లో డబ్బుతో సంబంధం లేకుండా చేయడానికి తాను పవన్ తో కలుస్తున్నానని, తాను ఇదివరకే ఈ విషయం పై చర్చించానని, 2014 లోనే జనసేనలో చేరాలి, కాని తన కుటుంబ పరిస్థితుల కారణంగా అది కుదర్లేదు అని, ఇన్నాళ్లకు కలిసి పనిచేసే అవకాశం వచ్చిందని తాను కూడ సామాన్య జనసేనికుడిలాగే పనిచేయడానికి సిద్ధం” అని అన్నారు.