లేక్మీ ఫ్యాషన్ షోలో జాన్విక‌పూర్
Spread the love

బాలీవుడ్ బ్యూటీ జాన్విక‌పూర్ స్పీడ్ పెంచేసింది. ‘ధడక్’ ఫిల్మ్ తర్వాత ఏదోవిధంగా హైలైట్ అవుతూ వస్తోంది. తాజాగా లేక్మీ ఫ్యాషన్ షోలో ర్యాంప్‌పై తనదైన శైలిలో హొయలొలికించింది ఈ అమ్మడు. తన ఫస్ట్ క్యాట్‌వాక్‌తో అందర్నీ ఆకట్టుకుంది.ర్యాంప్ వాక్ చేసే బ్యూటీలు అందర్నీ ఆకట్టుకోవడానికి రకరకాల డ్రెస్సులతో వెరైటీగా దర్శనమిస్తారు. డిజైనర్ నచికేత్ బార్వే రూపొందించిన డ్రెస్సులో తళుక్కున మెరిసింది జాన్వి. ఎంబ్రాయిడరీ బ్లౌజ్, స్కర్ట్‌తో కలర్‌ఫుల్‌గా కనిపించింది. దీనికితోడు తన డ్రెస్సులో వజ్రాలు కూడా ఆకర్షణీయంగా మెరిశాయి. సింపుల్ మేకప్‌తో చాలా అట్రాక్టివ్‌గా కనిపించింది జాన్వికపూర్.