Spread the love

ఏలూరు: జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం చివరి రోజున పశ్చిమగోదావరి జిల్లా పర్యటించనున్నారు. ఇవాళ ఉదయం 10 గంటలకు పాలకొల్లులోని గాంధీ బొమ్మ సెంటర్‌లో బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా అభిమానులు, కార్యకర్తలను ఉద్దేశించి పవన్ మాట్లాడనున్నారు. అనంతరం 11 గంటలకు నరసాపురం బహిరంగ సభలో పవన్ పాల్గొననున్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు భీమవరంలోని పోలీసు బొమ్మ సెంటర్‌లో ఎన్నిక ప్రచారం నిర్వహించి ఫుల్‌స్టాప్ పెట్టనున్నారు.