జనసేనకు సపోర్ట్ గా అమెరికాలో కార్లతో భారీ ర్యాలీ…
Spread the love

ఈ రోజు తూర్పుగోదావరి జిల్లాలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ‘జనసేన కవాతు’లో పాల్గొననున్న సంగతి తెలిసిందే. మధ్యాహ్నం 3 గంటలకు ఇక్కడి పిచ్చుకలంక నుంచి సర్ ఆర్ధర్ కాటన్ విగ్రహం వరకూ యాత్ర సాగనుంది. అయితే పోలీసులు జనసేన కవాతుకు కొద్దిసేపటి క్రితం అనుమతిని నిరాకరించిన నేపథ్యంలో అసలు జనసైనికుల కవాతు జరుగుతుందా..? లేదా..? అన్న అనుమానం ఏర్పడింది . అయితే జనసేన కవాతుకు మద్దతుగా పవన్ కళ్యాణ్ అభిమానులు అమెరికాలోని వర్జీనియాలో కార్లతో భారీ ర్యాలీ చేపట్టారు.

జనసేన జెండాలు రెపరెపలాడుతుండగా, కార్లు ఒకదాని వెంట మరొకటి దూసుకెళ్లాయి. ఈ సందర్భంగా ఓ చోటుకు చేరుకున్న అభిమానులు జై జనసేన, జై పవన్ కళ్యాణ్ నినాదాలతో హోరెత్తించారు. అనంతరం కార్లను ‘జన సేన’ అనే ఇంగ్లిష్ అక్షరాల్లో ఉన్నట్లు పార్క్ చేసి తమ అభిమానాన్ని తెలియజేశారు. దీన్ని ప్రత్యేకమైన డ్రోన్ తో చిత్రీకరించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.