కన్నడ సినీ దిగ్గజాలపై ఐటీ దాడులు…
Spread the love

కర్ణాటకలో ఐటీ దాడులు కలకలం సృష్టిస్తున్నాయి… ఇవాళ ఉదయం 6 గంటల నుంచి సినీ దిగ్గజాల ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ నివాసంతో పాటు… ముఖ్యమంత్రి కుమారస్వామి భార్య అయిన సినీనటి రాధిక నివాసంలోనూ ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. హీరో సుదీప్ నివాసంతో పాటు కన్నడ ఫిల్మ్ ఇండ్రస్ట్రీలోని దాదాపు 10 మంది సినీ దిగ్గజాలపై ఏకకాలంలో ఐటీ దాడులు జరుగుతున్నాయి. కన్నడ బిగ్ ప్రొడ్యూసర్ రాక్‌లైన్ వెంకటేష్‌ను కూడా వదలని ఐటీ అధికారులు… కేజీఎఫ్ ప్రొడ్యూసర్ విజయ్ సహా శివ్ రాజ్‌కుమార్, సీఆర్ మనోహర్ ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు కన్నడ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖుల ఇళ్లలో ఐటీ సోదాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ప్రముఖ నిర్మాతల ఇళ్లలో డాక్యుమెంట్లను తనిఖీ చేసినట్లు తెలుస్తోంది. తనిఖీల సమయంలో అందరి ఫోన్లు స్విచ్ఛాఫ్ చేయడంతో దీనిపై స్పందించేందుకు సినీ ప్రముఖులెవరూ అందుబాటులో లేరని కన్నడ మీడియా పేర్కొంది.