బెజవాడలో ఐటీ దాడుల కలకలం.. టీడీపీ నేతల ఇళ్లపై దాడులకు పక్కా వ్యూహం..?
Spread the love

ఇటీవల తెలంగాణలో ఆ రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ కార్యానిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి నివాసంపై ఐటీ సోదాలు జరిగిన సంగతి విదితమే. తెలంగాణలో కలకలం రేపిన ఆదాయపు పన్ను శాఖ అధికారుల దాడులు.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌కు మారాయి. విజయవాడలోని పలువురి ప్రముఖుల ఇళ్లపై ఐటీ దాడులు జరగబోతున్నాయని ప్రచారం జరుగుతుండటంతో నగరంలో కలకలం రేగుతోంది. ఢిల్లీ నుంచి వచ్చిన 8 ప్రత్యేక బృందాలు ఆటోనగర్‌లోని ఆదాయపు పన్ను శాఖ కార్యాలయంలో మకాం వేశాయి. ఎవరెవరి ఇళ్లపై సోదాలు నిర్వహించాలో తెలుసుకుని.. పక్కా సమాచారంతో రంగంలోకి దిగాయి. ఆంధ్రప్రదేశ్‌ పురపాలక శాఖ మంత్రి, నారాయణ విద్యాసంస్థల అధినేత పి.నారాయణ ,నెల్లూరు జిల్లా టీడీపీ నేత, కావలి నియోజకవర్గ ఇన్‌ఛార్జి, ప్రముఖ పారిశ్రామిక వేత్త బీద మస్తాన్‌రావు ఆస్తులపై ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు చేస్తున్నట్లు ప్రచారం జోరుగా సాగుతోంది.