అంబానీ ఇషా వివాహ సంగీత్ కార్యక్రమంలో   పాప్ స్టార్ షో !!
Spread the love

ఇండియాలోనే నెం.1 ప్రముఖ బిజినెస్ మన్ అయిన ముఖేష్ అంబానీ కూతురు ఇషా అంబానీ కూతురు వివాహ నిశ్చితార్థం ఇటీవలే ఇటలీలో నిర్వహించిన విషయం తెల్సిందే. ఇటలీలో జరిగిన వివాహ నిశ్చితార్థ వేడుకలో పలువురు బాలీవుడ్ స్టార్స్ మరియు ప్రముఖులు పాల్గొన్నారు. ఇక ప్రస్తుతం పెళ్లి వేడుకల్లో అంబానీ కుటుంబ సభ్యులు నిమగ్నమై ఉన్నారు. డిసెంబర్ 10న ఇషా అంబానీ మరియు ఆనంద్ ల వివాహంను నిర్వహించేందుకు అత్యంత ఖర్చు చేసి ఏర్పాట్లు చేస్తున్నారు. వివాహ నిశ్చితార్థంకే బాలీవుడ్ మొత్తం దిగిపోయింది అలాంటిది వివాహానికి ఎలా ఉంటుందో పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. వివాహం కోసం భారీ ఎత్తున ఏర్పాట్లు జరుపుతున్న నిర్వహకులు హాలీవుడ్ పాప్ హాట్ స్టార్ బియాన్స్ ను రంగంలోకి దించబోతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా పాప్ రంగంను ఒక ఊపు ఊపేస్తోన్న ఈమె ఇషా వివాహ సంగీత్ కార్యక్రమంలో షో చేయబోతుంది. ప్రీ వెడ్డింగ్ ను రెండు రోజుల పాటు ప్లాన్ చేస్తున్నారు.

వచ్చే డిసెంబర్ 8 మరియు 9 వ తేదీల్లో బియాన్స్ తో పాటు బాలీవుడ్ స్టార్స్ కూడా ఆడి పాడేందుకు సిద్దం అవుతున్నారు. సంగీత్ కార్యక్రమం కోసం ఇప్పటి నుండే రిహార్సల్స్ జరుగుతున్నట్లుగా బాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. భారీ ఎత్తున ప్రీ వెడ్డింగ్ కార్యక్రమాలు నిర్వహిస్తూ అందరి దృష్టిని ఆకర్షించేందుకు అంబానీ ఫ్యామిలీ ప్రయత్నాలు చేస్తోంది. నభూతో నభవిష్యతి అన్నట్లుగా ఈ పెళ్లి ఉండబోతుందని ఏర్పాట్లను చూస్తుంటే అనిపిస్తోంది.