ఐపీఎల్‌లో ఈ రెండు జట్లే ప్లేఆఫ్ కు చేరుకునేవా?
Spread the love

ఈ ఏడాది ఐపీఎల్‌ లీగ్‌ పోటీలు చివరి దశకు చేరుకున్నాయి. వచ్చే ఆదివారం నాటికి అంటే మే 20తో లీగ్‌ దశ పోటీలు ముగియనున్నాయి. దీంతో ఇక నుంచి జరిగే ప్రతి మ్యాచ్‌ ఆసక్తికరంగా సాగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయా జట్లు ప్లేఆఫ్స్‌లో స్థానం సంపాదించాలని కసిగా ఉన్నాయి. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్లు మాత్రం మిగతా వాటితో ఎలాంటి పోటీ లేకుండా ఇప్పటికే ప్లేఆఫ్స్‌లో తమ స్థానాలను ఖరారు చేసుకున్నాయి. దిల్లీ ప్లేఆఫ్‌కు చేరే అవకాశాన్ని దాదాపుగా కోల్పోయింది. అసలు ఏయే జట్లు ఇప్పటికి(మే 14 నాటికి) ప్లేఆఫ్స్‌లో చోటు దక్కించుకున్నాయి… మిగతా ఏ జట్లు ప్లేఆఫ్స్‌లో చోటు దక్కించుకునేందుకు పోటీపడుతున్నాయో చూద్దాం. పాయింట్లు, నెట్‌ రన్‌రేట్‌ ఆధారంగా అత్యుత్తమ ప్రదర్శన చేసిన నాలుగు జట్లు ప్లేఆఫ్స్‌లో చోటు దక్కించుకుంటాయి.

సన్రైజర్స్ హైదరాబాద్: బౌలింగే‌ ప్రధాన అస్త్రంగా బరిలోకి దిగిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌… ఇప్పటి వరకూ 12 మ్యాచ్‌లాడి 9 విజయాలు సాధించింది. ఈ ఏడాది ఐపీఎల్‌‌లో ప్లేఆఫ్స్‌కు చేరిన మొదటి జట్టుగా నిలిచింది. లీగ్‌లో ఇంకా రెండు మ్యాచ్‌లు ఆడాలి. ఒకవేళ వీటిల్లో ఓడిపోయినా టాప్‌-4లో ఉండటం ఖాయం.

చెన్నై సూపర్కింగ్స్: రెండేళ్ల నిషేధం తర్వాత ఐపీఎల్‌లో అడుగుపెట్టింది. ఇప్పటి వరకు 12 మ్యాచ్‌లాడిన చెన్నై 8 విజయాలతో 16 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. ప్లే ఆఫ్స్‌కు చేరుకున్న రెండో జట్టు ఇది.

కింగ్స్ఎలెవన్పంజాబ్‌:  పంజాబ్ కి ఇంకా రెండు మ్యాచ్ లు మాత్రమే ఉన్నాయి. అవి ముంబయి ఇండియన్స్‌, చెన్నై సూపర్‌కింగ్స్‌తో తలపడాల్సి ఉంది.ఈ రెండు మ్యాచ్‌ లు గెలిచినా పంజాబ్‌ ప్లేఆఫ్స్‌కు చేరుకుంటుంది. కానీ, రెండు మ్యాచ్‌లు గెలిస్తే ప్లేఆఫ్స్‌లో స్థానంపై ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ ఏ రెండు మ్యాచ్‌ల్లో ఒక మ్యాచ్ ఓడిపోయినా పంజాబ్ టాప్‌-4లో చోటు దక్కించుకుంటుందో లేదో చెప్పలేం. చివరి వరకు వేచి చూడాల్సిందే.

కోల్కతా నైట్రైడర్స్‌: లీగ్‌లో ఇంకా రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఈ రెండు మ్యాచ్‌లు గెలవడంతో పాటు మంచి నెట్‌ రన్‌రేట్‌ సాధిస్తేనే కోల్‌కతా ప్లేఆఫ్స్‌లో చోటు దక్కించుకోగలుగుతుంది. లేదంటే ముంబయి ఇండియన్స్‌ నుంచి కోల్‌కతాకు చుక్కెదురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ముంబయి రనరేట్‌ కోల్‌కతా కంటే మెరుగ్గా ఉంది. రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగే తదుపరి మ్యాచ్‌లో కోల్‌కతా భారీ తేడాతో గెలిస్తే ప్లేఆఫ్స్‌ చేరుకునే అవకాశాలు మెరుగుపడతాయి.

రాజస్థాన్రాయల్స్‌: ఆడిన 12 మ్యాచ్‌ల్లో ఆరు విజయాలతో నాలుగో స్థానంలో ఉన్న రాజస్థాన్‌  ఒక్క విజయం సాధిస్తే  ప్లేఆఫ్స్‌ కు చేరుకునే అవకాశం ఉంది. టోర్నీలో భాగంగా తన తదుపరి మ్యాచ్‌లో రాజస్థాన్‌… కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో తలపడనుంది. ఆదివారం ముంబయి ఇండియన్స్‌పై విజయంతో రాజస్థాన్‌ టాప్‌-4లో నిలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

ముంబయి ఇండియన్స్‌: మూడుసార్లు ఐపీఎల్‌ ట్రోఫీని ముద్దాడిన ఏకైక జట్టు ముంబయి ఇండియన్స్‌. అలాంటి ముంబయి జట్టు ఈ సీజన్‌లో నిరాశ పరిచింది. 12 మ్యాచ్‌ల్లో 5 మాత్రమే గెలిచింది. ఆదివారం రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓటమితో ఈ జట్టుకు ప్లేఆఫ్స్‌లో చోటు దక్కించుకునే అవకాశాలు సన్నగిల్లాయి. ప్రస్తుతం ముందు ఉన్నకింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ ఇంకా రెండు మ్యాచ్‌లు ఆడాలి. ఈ రెండు మ్యాచ్‌లు ఓడిపోతే ముంబయి ప్లేఆఫ్‌ చేరుకునే అవకాశాలు ఉన్నాయి.

రాయల్ఛాలెంజర్స్బెంగళూరు: ‘ఈ ఏడాది ఐపీఎల్‌ ట్రోఫీ మా సొంతం’ అంటూ బరిలోకి దిగిన బెంగళూరు జట్టు ఘోర పరాభవాలను చవి చూసింది. పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో కొనసాగుతోంది. బెంగళూరు ఇంకా 2 మ్యాచ్‌లు ఆడాలి. ఈ రెండు మ్యాచ్‌ల్లో గెలిచిస్తే తప్ప కోహ్లీ సేన ప్లేఆఫ్‌లో చోటు దక్కించుకోలేదు.

దిల్లీ డేర్డెవిల్స్‌: ఈ ఏడాది ఐపీఎల్‌ సీజన్‌లో ఇప్పటికే దిల్లీ డేర్‌డెవిల్స్‌ కథ ముగిసింది. ఆడిన 12 మ్యాచ్‌ల్లో మూడింట్లో గెలిచి పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. ఇంకా ఆడాల్సింది రెండు మ్యాచ్‌లు. వాటిల్లో గెలిచినా ప్లేఆఫ్‌కి చేరుకోలేదు.

మరి ఏ నాలుగు జట్లు ప్లేఆఫ్స్‌లో చేటు దక్కించుంటాయో… ఏ నాలుగు జట్లు టోర్నీ నుంచి నిష్ర్కమిస్తాయో తెలియాలంటే మాత్రం కొద్ది రోజులు వేచి ఉండాల్సిందే.

పాయింట్స్:

 Team P W L PTS NRR
 SRH 12 9 3 18 +0.400
 CSK 12 8 4 16 +0.383
 KKR 12 6 6 12 -0.189
 RR 12 6 6 12 -0.347
 KXIP 12 6 6 12 -0.518
 MI 12 5 7 10 +0.405
 RCB 12 5 7 10 +0.218
 DD 12 3 9 6 -0.478