
ప్రతిష్ఠాత్మకమైన నిట్ వరంగల్‌కు ఈ నెల 8న భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు వస్తున్నారు. నిట్‌లో ఈ నెల 8నుంచి నిర్వహించనున్న జూబ్లీ ఉత్సవాలకు ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. ఈ ఏడాదంతా వజ్రోత్సవాలకు సంబంధించి వివిధ కార్యక్రమాలు నిర్వహించడానికి నిట్ అడ్మినిస్ట్రేషన్ భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఉత్సవాలకు ముఖ్యఅతిధిగా భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య హాజరై వివిధ అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన, నిట్‌కు సంబంధించి సావనీర్‌ను ఆవిష్కరించనున్నారు.
ఇందుకోసం నిట్‌లో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. నూతన కోర్సులు ప్రారంభంతో పాటు క్యాంప్‌స అభివృద్ధిపై నిట్డైరెక్టర్ రమణారావు ఒక నివేదికను వెంకయ్యకు అందించనున్నట్లు సమాచారం. ఏడాదంతా జరిగే ఈ వజ్రోత్సవాలకు రాష్ట్ర గవర్నర్ నర్సింహాన్తోపాటు కేంద్ర, రాష్ట్ర మంత్రులు సైతం హాజరుకానున్నట్లు సమాచారం.