మళ్లీ టైటిల్‌ సాధించిన భారత్‌
Spread the love

ఆసియా కప్‌కు అదిరిపోయే ముగింపు లభించింది. ఆధిక్యం ఇరు జట్ల మధ్య దోబూచులాడిన వేళ చివరకు భారత జట్టు చాంపియన్‌గా నిలిచింది. బంగ్లాదేశ్‌తో శుక్రవారం నాడు జరిగిన ఫైనల్లో భారత్‌ 3 వికెట్ల తేడాతో నెగ్గింది. ఇది భారత్‌కు ఏడో ఆసియా కప్‌ టైటిల్‌. రోహిత్‌ శర్మ (48) కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. అంతకుముందు బంగ్లాదేశ్‌ 48.3 ఓవర్లలో 222 పరుగులకు ఆలౌటైంది. లిటన్‌ దాస్‌ (117 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సర్లతో 121) శతకం సాధించగా సౌమ్య సర్కార్‌ (33), మెహదీ హసన్‌ (32) ఫర్వాలేదనిపించారు. కుల్దీ్‌పకు మూడు, కేదార్‌ జాదవ్‌కు రెండు వికెట్లు దక్కగా బంగ్లా ఇన్నింగ్స్‌లో ఎనిమిది మంది బ్యాట్స్‌మెన్‌ రెండంకెల స్కోరు చేయలేకపోయారు. ఆ తర్వాత లక్ష్యం కోసం బరిలోకి దిగిన భారత జట్టు 50 ఓవర్లలో 7 వికెట్లకు 223 పరుగులు చేసి గెలిచింది. భారత్‌ తరఫున ఒక్క బ్యాట్స్‌మన్‌ కూడా అర్ధసెంచరీ చేయలేదు మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ లిటన్‌ దాస్‌కు దక్కగా.. శిఖర్‌ ధవన్‌ మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌గా నిలిచాడు.

ఓవరాల్‌గా నిలకడగా లక్ష్య ఛేదన చేసిన టీమ్‌ఇండియా.. శుక్రవారం నాడు జరిగిన ఫైనల్లో 3 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌ను ఓడించింది. దీంతో రికార్డు స్థాయిలో ఏడోసారి టైటిల్‌ను చేజిక్కించుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ 48.3 ఓవర్లలో 222 పరుగులకు ఆలౌటైంది. లిట్టన్ దాస్ (117 బంతుల్లో 121; 12 ఫోర్లు, 2 సిక్సర్లు) కెరీర్‌లో తొలి శతకాన్ని సాధించాడు. సౌమ్య సర్కార్ (45 బంతుల్లో 33; 1 ఫోర్, 1 సిక్స్), మెహిది హసన్ (59 బంతుల్లో 32; 3 ఫోర్లు) రాణించారు. తర్వాత భారత్ 50 ఓవర్లలో 7 వికెట్లకు 223 పరుగులు చేసింది. రోహిత్ (55 బంతుల్లో 48; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), కార్తీక్ (61 బంతుల్లో 37; 1 ఫోర్, 1 సిక్స్), ధోనీ (67 బంతుల్లో 36; 3 ఫోర్లు) తలా కొన్ని పరుగులు జత చేసారు.

స్కోరు బోర్డు

బంగ్లాదేశ్: లిట్టన్ దాస్ (స్టంప్) ధోనీ (బి) కుల్దీప్ 121, మెహిది హసన్ (సి) రాయుడు (బి) జాదవ్ 32, ఇమ్రూల్ కైస్ ఎల్బీ (బి) చాహల్ 2, ముష్ఫికర్ (సి) బుమ్రా (బి) జాదవ్ 5, మిథున్ రనౌట్ 2, మహ్మదుల్లా (సి) బుమ్రా (బి) కుల్దీప్ 4, సౌమ్య సర్కార్ రనౌట్ 33, మోర్తజా (స్టంప్) ధోనీ (బి) కుల్దీప్ 7, నజ్ముల్ రనౌట్ 7, ముస్తాఫిజుర్ నాటౌట్ 2, రూబెల్ (బి) బుమ్రా 0, ఎక్స్‌ట్రాలు: 7, మొత్తం: 48.3 ఓవర్లలో 222 ఆలౌట్.వికెట్లపతనం: 1-120, 2-128, 3-137, 4-139, 5-151, 6-188, 7-196, 8-213, 9-222, 10-222.బౌలింగ్: భువనేశ్వర్ 7-0-33-0, బుమ్రా 8.3-0-39-1, చాహల్ 8-1-31-1, కుల్దీప్ 10-0-45-3, జడేజా 6-0-31-0, జాదవ్ 9-0-41-2.

భారత్: రోహిత్ (సి) ఇస్లామ్ (బి) రూబెల్ 48, ధవన్ (సి) సౌమ్య (బి) ఇస్లామ్ 15, రాయుడు (సి) ముస్తాఫిజుర్ (బి) మోర్తజా 2, కార్తీక్ ఎల్బీ (బి) మహ్మదుల్లా 37, ధోనీ (సి) ముష్ఫికర్ (బి) ముస్తాఫిజుర్ 36, కేదార్ 23నాటౌట్, జడేజా (సి) ముష్ఫికర్ (బి) రూబెల్ 23, భువనేశ్వర్ (సి) ముష్ఫికర్ (బి) ముస్తాఫిజుర్ 21, కుల్దీప్ నాటౌట్ 5. ఎక్స్‌ట్రాలు: 13, మొత్తం: 50 ఓవర్లలో 223/7.వికెట్లపతనం: 1-35, 2-46, 3-83, 4-137, 5-160, 6-212,7-214. బౌలింగ్: మెహిది హసన్ 4-0-27-0, ముస్తాఫిజుర్ 10-0-38-2, ఇస్లామ్ 10-0-56-1, మోర్తజా 10-0-35-1, రూబెల్ 10-2-26-2, మహ్మదుల్లా 6-0-33-1.