ఐఏఎస్‌ జంట పెళ్లి కి రూ.500 మాత్రమే ఖర్చు !
Spread the love

ఒక ఐఏఎస్‌ జంట పెళ్లి కి రూ.500 మాత్రమే ఖర్చు చేసింది.ఇద్దరు ఐఏఎస్ అధికారులు పరస్పరం ప్రేమించుకొని నిరాడంబరంగా వివాహం చేసుకున్నారు. ఆర్భాటాలతో పెళ్లిళ్లు చేసి అప్పులపాలవుతున్న వారికి ఆదర్శంగా నిలిచి, సమాజానికి కొత్త సందేశాన్ని అందించారు. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడకు చెందిన ఐఏఎస్‌ అధికారిణి హెప్సిబారాణి ఉడుపి జిల్లా అధికారిణిగా పనిచేస్తున్నారు. అదేవిధంగా పశ్చిమబెంగాల్‌కు చెందిన కర్ణాటక కేడర్‌ ఐఏఎస్‌ అధికారి ఉజ్వల్‌ కుమార్‌ ఘోష్‌ బాగల్‌ కోట జిల్లా కృష్ణా ఎగువ ప్రాజెక్టు కమిషనర్‌గా పనిచేస్తున్నారు. వీరిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకున్నారు. అనంతరం పెద్దలను ఒప్పించి, సోమవారం హుబ్లీలోని మినీ విధానసౌధలో బంధుమిత్రుల సమక్షంలో నిరాడంబరంగా పెళ్లి చేసుకున్నారు.

తరువాత వారు మాట్లాడుతూ ఆడంబరంగా పెళ్లిళ్లు చేస్తూ పేద కుటుంబాలు అప్పుల పాలవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పెళ్లికి ఎంత ఖర్చు పెట్టామనే విషయం పరిగణనలోకి రాదని, నూతన దంపతులు భవిష్యత్‌లో ఆర్థిక ఇబ్బందులు లేకుండా సుఖంగా గడపడమే ముఖ్యమన్నారు.ఈ పెళ్లికి రూ.500 మాత్రమే ఖర్చు అయినట్లు వారి పేర్కొన్నారు.