ఆదాయ‌పు ప‌న్ను రిట‌ర్నులు ఎందుకు ఫైల్ చేయాలి? ఎలా చేయాలి??
Spread the love

జులై నెల వ‌చ్చిందంటే చాలు ఎక్కువ మంది ఉద్యోగులు ఆలోచించేది ఆదాయ‌పు ప‌న్ను రిట‌ర్నుల గురించే. అయితే  కాని ఈ ప్ర‌క్రియ‌ను సుల‌భ‌త‌రం చేసేందుకు ఐటీ శాఖ ఎన్నో చ‌ర్య‌లు చేప‌ట్టింది. ఆన్‌లైన్‌లో ప్ర‌తి ఒక్క‌రూ ఐటీ రిట‌ర్నులు ఫైల్ చేసేలా ఈ_ఫైలింగ్ వెబ్‌సైట్లో అన్ని ఏర్పాట్లు చేసిందనే చెప్పాలి. అయితే  వీటిల్లో ఆన్‌లైన్ ట్యాక్స్ చెల్లింపులు, ప‌న్ను చెల్లింపు ఫారాల స‌రళీక‌ర‌ణ‌, ఈ-వెరిఫికేష‌న్, వెబ్‌సైట్లోనే మ‌దింపు వంటివి కూడా ఉన్నాయి. ఇంకా రెగ్యుల‌ర్‌గా ఈ-మెయిల్స్, మెసేజ్‌లు పంప‌డం, ప్ర‌క‌ట‌న‌ల ద్వారా అవ‌గాహ‌న క‌ల్పించ‌డం వంటి వాటినెన్నో ఆదాయ‌పు ప‌న్ను శాఖ చేసింది.  అందుకే ఐటీ రిట‌ర్నులు ఫైల్ చేసేందుకు ఏ మాత్రం సంకోచించ‌కూడ‌దు. ఈ క్ర‌మంలో ఐటీ రిట‌ర్నుల‌ను స‌మ‌ర్పించేందుకు ఎన్నో ప్రైవేట్ వెబ్‌సైట్లు సాయం చేస్తున్నాయి. అయితే ఇలాంటి చ‌ర్య‌ల మూలంగా ప‌న్ను చెల్లింపుదార్ల‌కు సంబంధించి అప్ర‌క‌టిత ఆదాయంపైన ఐటీ శాఖ దృష్టి ఎక్కువైందనే చెప్పాలి. దీంతో 2015-16లో 4 కోట్ల‌కు పైగా ఉన్న ఐటీ రిట‌ర్నులు 2016-17 వ‌చ్చేస‌రికి 5.68 కోట్లు అయ్యాయి. కాబ‌ట్టి ఇప్పుడు ప‌న్ను రిట‌ర్నులు ఫైల్ చేయ‌కుండా ఆదాయం ప్ర‌క‌టించ‌కుండా దాచిపెడితే ప‌న్ను చెల్లింపుదారులే ఇబ్బందులు ఎదుర్కొనాల్సి ఉంటుందనే చెప్పాలి.  అయితే ఆదాయ‌పు ప‌న్ను శాఖ ఐటీఆర్ ప్ర‌క్రియ‌ను ఏ విధంగా సులువు చేసిందో ఇక్క‌డ తెలుసుకుందాం. వేగంగా, సుల‌భంగా ఐటీ రిట‌ర్నులు ఫైల్ చేయ‌గ‌ల‌ర‌న‌డానికి  కొన్ని కార‌ణాలు ఇవే… వాటిని ఒకసారి చూద్దాం !!!

రిజిస్ట‌ర్ చేయ‌డం సులువు

మీరు ప‌న్ను రిట‌ర్నులు స‌మ‌ర్పించాలంటే మొద‌ట ఐటీ శాఖ వెబ్‌సైట్లో రిజిస్ట‌ర్ చేసుకోవల్సి ఉంటుంది. ఇందు కోసం లాగిన్ ఐడీ కావాలి. అయితే  పాన్ కార్డ్ నెంబ‌రే మీ లాగిన్ ఐడీ. పాన్ కార్డు ఎంట‌ర్ చేసిన త‌ర్వాత అక్క‌డ ఇచ్చిన ప్ర‌క్రియ‌ను అనుస‌రిస్తే మీరు ఇలాంటి ఇబ్బందులు  లేకుండా ఐటీ రిట‌ర్నుల‌ను స‌మ‌ర్పించ‌గ‌ల‌రు.

ఒక‌సారి లాగిన్ అయితే మీ ముందు వివ‌రాల ప్ర‌త్య‌క్షం

ప‌న్ను చెల్లింపుదార్ల కోసం ఎన్నో ఏళ్లుగా ఐటీ రిట‌ర్నుల ఫారాల‌ను మారుస్తున్నారని మనకు తెలిసిందే. కాని  వీలైనంత సులువుగా ఉండేలా చేశారు. వివ‌రాల‌ను ఎంట‌ర్ చేయ‌డంలో పొర‌పాట్ల‌కు తావివ్వ‌కుండా ముందుగానే కొన్ని వివ‌రాల‌ను ప్ర‌త్య‌క్ష‌మ‌య్యేలా ఐటీ శాఖ చేసింది. దీంతో మీరు వివ‌రాలు నమోదు చేసే శ్ర‌మ తప్పింది. ఐటీఆర్ 1 ఫైల్ చేసేట‌ప్పుడు .. పాన్, ఫారం 26ఏఎస్ ద్వారా ప‌న్ను అధికారులు మీ రిట‌ర్నుల ఫైలింగ్ స‌మ‌యంలో వివ‌రాల‌ను వ‌చ్చేలా చేశార‌ని డెలాయిట్ ఇండియా ప్ర‌తినిధి దివ్య బ‌వేజా తెలియజేసారు.

పేమెంట్లు సైతం ఆన్‌లైన్ మార్గంలోనే

ఈ-పేమెంట్ల విధానం ద్వారా ప‌న్నును ఆన్‌లైన్‌లోనే చెల్లించ‌వ‌చ్చు. ప‌న్ను రిట‌ర్ను ఫారంలోనే ఇందుకు సంబంధించిన లింక్ ఉంచారు. అది క్లిక్ చేయ‌గానే ఈ-పేమెంట్ పోర్ట‌ల్‌కు రీడైరెక్ట్ అవుతుంది. ఇది ప‌న్ను చెల్లింపు ప్ర‌క్రియ‌ను ఎంత‌గానో సుల‌భ‌త‌రం చేసిందనే చెప్పాలి.

ఐటీఆర్ ఈ-వెరిఫికేష‌న్

అయితే  ఈసారి కొత్త‌గా వ‌చ్చిన మార్పుల్లో వెరిఫికేష‌న్ ఆప్ష‌న్ ఒక‌టి. గ‌తంలో ఈ-ఫైలింగ్ చేసే స‌మ‌యంలో వెరిఫికేష‌న్ చేయ‌డానికి వీలులేదు. ఇప్పుడు ఈఫైలింగ్ త‌ర్వాత కూడా వెరిఫికేష‌న్ చేయ‌వ‌చ్చు. ఎల‌క్ట్రానిక్ ప‌ద్ధ‌తిని ఉప‌యోగించ‌డం ద్వారా ఐటీఆర్‌ను చూసుకోవ‌చ్చు. అయితే గ‌తంలోలా రిజిస్ట‌ర్డ్ ఈ-మెయిల్ ద్వారా ఓటీపీని ఉప‌యోగించి ఈ-వెరిఫై చేసే ప‌ద్ధ‌తి ఇప్పుడు లేదనే మనకు తెలుస్తుంది.

ఈ-మ‌దింపు

ఆన్‌లైన్‌లో ఐటీఆర్-1ను ఫైలింగ్ చేయడం ద్వారా పేరు, అడ్రస్, పాన్ నంబర్ వివరాలు, పన్ను వివరాలు చాలా వరకూ ఆటో పాపులేట్ ద్వారా వచ్చేస్తాయి. అయితే ఫామ్ 26ఏఎస్‌లోని టీడీఎస్ వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో ఒకసారి సరి చూసుకోవాల్సిన అవసరం వుంది. ఒకవేళ టీడీఎస్ వివరాల్లో పొంతన లేకపోతే మీకు టాక్స్ క్రెడిట్ రాకుండా పోయే అవకాశం ఉంది. అందుకే పూర్తిగా ఆటోమాటిక్ ఇంపోర్ట్ పద్ధతి మీదే పూర్తిగా ఆధారపడకుండా ఒకసారి ఫామ్ 26ఏఎస్ లోని వివరాలతో సరిచూసుకునేందుకు వీలు క‌ల్పించారు.

ఐటీ శాఖ అధికారులు ప‌న్ను చెల్లింపుదార్ల‌ను వేధించే ఆస్కారం లేకుండా నోటీసుల‌ను ఈ-మెయిల్ ద్వారా పంపుతున్నారు. దానికి ట్యాక్స్ పేయ‌ర్లు స‌మాధానాన్నికూడా ఆన్‌లైన్‌లోనే పంప‌వ‌చ్చు.