నితిన్‌ బర్త్‌ డే గిఫ్ట్.. లైన్‌లోకి మరో ప్రాజెక్ట్‌
Spread the love

ఇప్పటికే రెండు సినిమాలను లైన్‌లో పెట్టిన యంగ్ హీరో నితిన్‌, తన పుట్టిన రోజు సందర్భంగా మరో ప్రాజెక్ట్‌ను ప్రకటించాడు. శ్రీనివాస కల్యాణం సినిమా తరువాత లాంగ్‌ గ్యాప్‌ తీసుకున్న నితిన్‌ ప్రస్తుతం వెంకీ కుడుముల దర్శకత్వంలో భీష్మా సినిమాలో నటించేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాతో పాటు చంద్రశేఖర్‌ ఏలేటి దర్శకత్వంలో మరో సినిమాను కూడా త్వరలో ప్రారంభించనున్నాడు.

ఈ రెండు సినిమాలు ఇంకా సెట్స్‌ మీదకు రాకముందే ఈ రోజు మరో సినిమాను ఎనౌన్స్‌ చేశాడు. తనతో ఛల్‌ మోహన్‌ రంగ సినిమాను తెరకెక్కించిన కృష్ణ చైతన్య దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నట్టుగా తెలిపాడు నితిన్‌. ఈ సినిమాను సొంత నిర్మాణ సంస్థ శ్రేష్ఠ మూవీ బ్యానర్‌ నితిన్‌ తండ్రి సుధాకర్‌ రెడ్డి నిర్మించనున్నాడు. 2020 సమ్మర్‌లో ప్రారభం కానున్న ఈ ప్రాజెక్ట్‌ తన కెరీర్‌లో ప్రతిష్టాత్మకమైన సినిమా అని ట్వీట్ చేశాడు నితిన్‌.