నాని ఇమేజ్ డ్యామేజ్
Spread the love

తెలుగులో బిగ్ బాస్ కార్యక్రమం అనగానే ప్రేక్షకులు చాలా ఆసక్తిని చూపెడతారు . హిందీలో దశాబ్దానికి పైగా ప్రసారం అవుతున్నటువంటి షో తెలుగులో ప్రసారం కాబోతుంది అని తెలియగానే బుల్లి తెర ప్రేక్షకులు సంతోషానికి గురి అయ్యారు . వారి సంతోషం రెట్టింపు అయ్యేలా మొదటి సీజన్కు ఎన్టీఆర్ ను హోస్ట్ గా తీసుకు వచ్చారు. నిర్వాహకులు అనుకున్నట్లుగానే మొదటి సీజన్ సూపర్ హిట్ అయ్యింది. ప్రస్తుతం బిగ్ బాస్ రెండవ సీజన్ ప్రసారం అవుతుంది. రెండవ సీజన్ కు ఎన్టీఆర్ అందుబాటులో లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో నానిని రంగంలోకి దించారు.

నేచురల్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకతను దక్కించుకున్నటువంటి నాని – ఇతర కథానాయకుల అభిమానులతో కూడా అభిమానింపబడ్డాడు. ఎన్నో మంచి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి – మెల్ల మెల్లగా స్టార్ కథానాయకుడిగా పేరు సంపాదించుకున్నాడు . ఇలాంటి సమయంలో బిగ్ బాస్ షో తన క్రేజ్ ను రెట్టింపు చేస్తుందని నాని భావించి ఆఫర్ రావడమే ఆలస్యం గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. బిగ్ బాస్ కమిట్ అవ్వడం నాని జీవితంలోనే అతి పెద్ద తప్పుడు నిర్ణయం అంటూ ఇప్పుడు ఆయన అభిమానులు తమ ఆలోచనల్ని వ్యక్తం చేస్తున్నారు .

మూవీ షూటింగ్స్ తో బిజీగా ఉంటున్నందువల్ల బిగ్ బాస్ ఎపిసోడ్స్ నాని చూస్తున్నట్లుగా లేడు. అందువల్ల వారాంతంలో షో నిర్వాహకులు ఇచ్చినటువంటి స్క్రిప్ట్ ప్రకారం హోస్టింగ్ చేసేస్తున్నాడు. షోను నాని చూడక పోవడం వల్ల ఇంట్లో వారి ప్రవర్తనను సొంతంగా విశ్లేషించడం కష్టం అవుతుంది. అలాంటి టైంలో రైటర్లు ఇచ్చిన స్క్రిప్ట్ ను చదవాల్సి వస్తుంది. అలా చేయడం వల్ల నాని ప్రేక్షకుల్లో బ్యాడ్ అవుతున్నాడు. నాని సొంతంగా ఆలోచించుకుని తన ఆలోచనకు తగినట్లుగా ఇంటి సభ్యులను ప్రశ్నించడం – ఇంటి సభ్యులను టార్గెట్ చేయడం వంటి చేస్తే బాగుండేది. కాని నాని రైటర్లు రాసిచ్చింది చదువుతున్న కారణంగా ప్రేక్షకులు తీవ్రంగా నిరాశకి గురి అవుతున్నారు.

కొన్నిసార్లు నాని బిగ్ బాస్ నిర్వాహకుల కారణంగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్ ను ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా కౌశళ్ ఆర్మీ ఎప్పటికప్పుడు నానిని టార్గెట్ చేస్తూనే ఉంది. నాని బిగ్ బాస్ కు హోస్ట్ గా సెట్ కాడు అంటూ ఆమద్య ఒక హ్యాష్ ట్యాగ్ జాతీయ స్థాయిలో ట్రెండ్ అయ్యింది అంటే కౌశల్ ఆర్మీ పవర్ ఏంటో – నాని ఇమేజ్ ఎంతగా డ్యామేజ్ అయ్యిందో అంచనా వేయొచ్చు . కౌశల్ ను అభిమానిస్తున్న జనాలతో పాటు సామాన్యులు కూడా నాని పై అసహనంతో ఉన్నారని టాక్ వినిపిస్తుంది. మొత్తానికి బిగ్ బాస్ కార్యక్రమంతో తన స్టార్ డంను పెంచుకోవాలని భావించిన నానికి అంతకంటే ఎక్కువే డ్యామేజీ అయ్యిందని సోషల్ మీడియా టాక్.