ప్రమాదం నుంచి తప్పించుకున్న హేమమాలిని
Spread the love

ఉత్తరప్రదేశ్‌లోని మధుర లోక్‌సభ బీజేపీ ఎంపీ హేమమాలిని నిన్న రాత్రి జరిగిన ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డారు.ఆమె ఆదివారం తన నియోజకవర్గమైన మధుర ప్రాంతంలోని మిథౌలీ గ్రామంలో ఓ సమావేశానికి వెళ్ళారు.  ఆ గ్రామంలో జరిగిన సభలో పాల్గొని, తిరిగి వస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కాన్వాయ్‌లో ప్రయాణిస్తుండగా ఈదురుగాలులు, ఉరుముల కారణంగా ఓ చెట్టు విరిగి ఆమె కారు ముందు పడింది. వాతావరణం అనుకూలంగా లేకపోవడాన్ని గ్రహించిన కాన్వాయ్ సిబ్బంది… చెట్టు కూలిపోతుండడాన్ని గమనించి బ్రేక్ వేశారు. ఒక్క క్షణం ముందు వచ్చినా ఆ చెట్టు ఆమె కారుపై పడి ఘోర ప్రమాదం జరిగి ఉండేదని అధికారులు వెల్లడించారు. భాజపా ఎంపీ హేమమాలినికి తృటిలో ప్రమాదం తప్పింది

తరువాత ఆ చెట్టును తొలగించి రహదారిని క్లియర్ చేశారు. బీజేపీ నేతలు తెలిపిన వివరాల ప్రకారం హేమమాలిని మాంట్ తహశీల్‌లోని మిట్టౌలీ గ్రామంలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. అక్కఢ ఆమె ప్రసంగిస్తుంన్నంతలోనే వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి. దీంతో తిరిగి వెనక్కి వెళ్లిపోవాలని ఆమె నిర్ణయించుకున్నారు. ఆమె కాన్వాయ్ కొద్ది దూరం వెళ్లగానే ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కాన్వాయ్ సిబ్బంది ప్రమాదాన్ని ముందుగానే గమనించడంతో ఆమెకు ప్రాణాపాయం తప్పింది.

ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలను ఉరుములు-మెరుపులతో కూడిన భారీ వర్షాలు, ఈదురుగాలులు అతలాకుతలం చేస్తున్నాయి.  ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, ఉత్తర్‌ప్రదేశ్‌, దిల్లీ, హిమాచల్‌ప్రదేశ్‌లో వర్షాల కారణంగా జరిగిన ప్రమాదాల్లో 46 మంది మృత్యువాతపడ్డారు. మరో 61 మంది తీవ్రంగా గాయపడ్డారు. రాబోయే 24 గంటల్లో హిమాచల్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, పంజాబ్‌, హరియాణ, చండీగఢ్‌, మధ్యప్రదేశ్‌, ఝార్ఖండ్‌, అసోం, మేఘాలయ, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, తమిళనాడులో ఈదురుగాలులతో కూడిన భారీవర్షాలు కురవొచ్చని వాతావరణశాఖ హెచ్చరించింది.