‘నేడే’…రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ ఎన్నిక
Spread the love

రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవి కోసం అధికార ఎన్డీయే, విపక్షాల ఐక్య కూటమి ప్రత్యక్ష పోరుకు సిద్ధమవుతున్నాయి. రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు ఆధ్వర్యంలో డిప్యూటీ చైర్మన్‌ ఎన్నిక గురువారం జరుగనున్నది. ఈ ఎన్నిక అధికార, విపక్షాల బల ప్రదర్శనకు వేదిక కానుంది. ఎన్డీయే తరపున జేడీయూ ఎంపీ హరివంశ్‌ నారాయణ్‌ సింగ్ మంగళవారమే నామినేషన్ దాఖలు చేయగా.., విపక్షాల తరపున కాంగ్రెస్‌ ఎంపీ కె. హరిప్రసాద్‌ బుధవారం ఐదుసెట్ల నామినేషన్లు దాఖలు చేసినట్టు రాజ్యసభ సచివాలయం వర్గాలు వెల్లడించాయి. తమ అభ్యర్థులకు మద్దతుగా ఆయా పక్షాలు కూడా నోటీసులు అందజేశాయి. హరివంశ్‌ తొలిసారి రాజ్యసభ ఎంపీ కాగా, హరిప్రసాద్‌ కాంగ్రెస్‌ తరపున మూడుసార్లు పార్లమెంటుకు ఎన్నికయ్యారు. ప్రస్తుతం రాజ్యసభ ఎంపీల మొత్తం సంఖ్య 244. డిప్యూటీ చైర్మన్‌గా గెలిచేందుకు కనీసం 123 మంది సభ్యుల మద్దతు అవసరం. తగినత ఎంపీల బలముందని ఇరు పక్షాలూ చెపుతున్నాయి. ఉదయం 11గంటలకు ఎన్నిక జరగనుంది.

Harivansh versus Hariprasad Rajya Sabha deputy Chairmans post