ప్రియుడి మీద కోపంతో ‘ట్రైలర్’ వదిలిన గర్ల్‌ఫ్రెండ్!
Spread the love

సాధారణంగా మీరు మీ గర్ల్‌ఫ్రెండ్‌ మెసేజ్‌కు రిప్లై ఇవ్వకపోతే.. ఆమె ఎలా స్పందిస్తుంది? చాలా కోప్పడుతుంది లేక తిడుతుంది కదూ. అయితే, ఈ గర్ల్‌ఫ్రెండ్ మాత్రం అలా కాదు.. తన బాయ్‌ఫ్రెండ్ ఫోన్, మెసేజ్‌లకు స్పందించడం లేదనే కోపంతో సినిమా తరహాలో ‘ట్రైలర్’ వదిలింది. ఆ ట్రైలర్‌కు ‘Where the f*** is George’ అనే టైటిల్ పెట్టింది. ఇక వివరాలలోకి వస్తే కాలిఫోర్నియా యూనివర్శిటీలో చదువుతున్న 21 ఏళ్ల పవులిజ్లే రమిజ్లే.. జార్జ్ అనే యువకుడిని ప్రేమిస్తోంది. ఒక రోజు అతడు ఆమెను బయటకు తీసుకుని వెళ్లి చికెన్ తినిపిస్తానని మాట ఇచ్చాడు. ఆ రోజు ఎంతకీ జార్జ్ నుంచి ఫోన్ రాకపోగా.. అతను పవులిజ్లే ఫోన్‌కాల్, మెసేజ్‌లకు రిప్లై కూడా ఇవ్వలేదు. దీంతో ఆగ్రహానికి గురైన పవులిన్ సినిమా తరహాలో ‘ట్రైలర్’ తయారు చేసి వదిలింది.

ఈ ట్రైలర్‌కు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటివరకు ఈ వీడియోను 1,68,600 మంది లైక్ చేయగా.. 51,325 మంది రిట్వీట్ చేశారు. దీంతో ఈ ట్రైలర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ట్రైలర్‌తో పాపులరైన పవులిజ్లే.. ఓ ఇంగ్లీష్ వెబ్‌సైట్‌తో మాట్లాడుతూ.. ‘‘వీడియో తయారు చేసిన తర్వాత తెలిసింది. నేను ఫోన్ చేసే సమయానికి జార్జ్ నిద్రపోయాడట. నాకు బోర్ కొట్టడంతో ఈ వీడియో చేయాలనే ఐడియా వచ్చింది. మీ బాయ్ ఫ్రెండ్ మీకు రిప్లై ఇవ్వకపోతే మీరు కూడా ఇలాంటి ‘ట్రైలర్’ వదలండి’’ అంటూ ఉచిత సలహా ఇచ్చింది పవులిజ్లే. పాపం బాయ్‌ఫ్రెండ్.. ఒక గంట నిద్రపోతే ఎంత పెద్ద పనిష్మెంటా? అయితే, ఈ ట్రైలర్ చూసిన తర్వాత అతను కూడా కడుపుబ్బా నవ్వుకోవడం గమనార్హం.