జీహెచ్‌ఎంసీ ‘ఫీడ్‌ ది నీడ్‌’ పేరుతో బహిరంగంగా ఫ్రిజ్‌లు ఏర్పాటు .
Spread the love

జీహెచ్‌ఎంసీ ‘ఫీడ్‌ ది నీడ్‌’ పేరుతో ప్రత్యేకంగా బహిరంగంగా ఫ్రిజ్‌లు ఏర్పాటు చేస్తోంది. మిగిలిన ఆహార పదార్థాలు అందులో పెడితే. అవసరమైన వారు వచ్చి తింటారు. ఇతరుల ఆకలి తీర్చాలనుకున్నా ఎక్కడ అందించాలో తెలియక వృథా చేస్తున్నారు. ఏదైనా శుభకార్యం చేస్తే అక్కడ పెద్దఎత్తున ఆహారం వృథా అవుతుంది, ఇక ఇళ్లలోనూ రోజువారీగా ఆహారం చెత్తపాలు అవుతుండటం తెలిసిందే. వృథా అరికట్టడం కోసం జీహెచ్‌ఎంసీ వినూత్న పథకాన్ని రూపొందించింది. ఇప్పటికే రూ.5తో పేదల ఆకలి తీర్చుతున్న బల్దియా దాతల సాయంతో ఫీడ్‌ ది నీడ్‌ కార్యక్రమం తీసుకొచ్చింది.

ఈ కార్యక్రమం చాలా మంది ఆకలి తీర్చి, ఆహార వృథా తగ్గిస్తుందని జీహెచ్‌ఎంసీ భావిస్తోంది. జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టులోని చిరంజీవి రక్తనిధి కేంద్రం వద్ద, మదాపూర్‌లోని శిల్పారామం సమీపంలో రిఫ్రిజిరేటర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆహారం ఆయా రిఫ్రిజిరేటర్లలో పెట్టి వెళితే ఆకలిగా ఉండేవారు వినియోగించుకొనేలా జనసమర్థ ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు.ముఖ్యమైన ప్రాంతాల్లో మరి పది రిఫ్రిజిరేటర్లను ఏర్పాటుచేసే ఆలోచనలో ఉన్నట్లు’ పశ్చిమ మండల జోనల్‌ కమిషనర్‌ హరిచందన తెలిపారు.