కాంగ్రెస్‌లోకి గద్దర్… గజ్వేల్ నుంచి కేసీఆర్‌పై పోటీ..?
Spread the love

ప్రముఖ ప్రజా గాయకుడు గద్దర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారా.. ? అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. ఆయన ఇప్పటికే ఢిల్లీ వెళ్లారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నాడు. ఈ విషయంలో మాజీ ఎంపీ మధు యాష్కీ కీలకంగా వ్యవహరిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. టీఆర్ఎస్ పాలనపై అసంతృప్తితో ఉన్న గద్దర్.. మహాకూటమికి అనుకూలంగా ప్రచారం జరిగింది.అంతేకాదు.. గజ్వేల్ నుంది గద్దర్ బరిలోకి దిగబోతున్నాడని చెబుతున్నారు. అంటే.. ఏకంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పైనే గద్దర్ పోటీ అన్నమాట. గజ్వేల్ నుంచి కేసీఆర్‌పై పోటీ చేయిస్తే ఆ ప్రభావం రాష్ట్రం మొత్తం ఉంటుందని కాంగ్రెస్ నేతలు సైతం భావిస్తున్నారు .

ఇక మరోవైపు, ఈ ప్రచారంలో నిజం లేదని గద్దర్ సన్నిహితులు చెబుతున్నారు . మాజీ ఎంపీ మధుయాష్కీతో కలిసి గద్దర్ ఢిల్లీ వెళ్లిన మాట నిజమే. రాహుల్ గాంధీని కలవబోతున్నది నిజమే. ఐతే, అది పార్టీలో చేరేందుకు కాదు. ఒక ఫౌండేషన్ కు సంబంధించి రాహుల్ గాంధీకి వినతిపత్రం ఇచ్చేందుకే ఆయన ఢిల్లీకి వెళ్లారని చెబుతున్నారు. ఇక, గజ్వేల్ స్థానం నుంచి ప్రతాప్ రెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. టీడీపీ నుంచి కాంగ్రెస్ లో చేరిన ప్రతాప్ రెడ్డికి అక్కడ మంచి పట్టుంది. గత ఎన్నికల్లోనే కేసీఆర్ కి గట్టిపోటీని ఇచ్చాడు ప్రతాప్ రెడ్డి.