లగ్జరీ అ౦టే మాల్యా, మాల్యా అ౦టే లగ్జరీ …  టాయిలెట్‌ కూడా గోల్డే !
Spread the love

దేశీయ బ్యాంకులలో ఎన్ని వేల కోట్లు ఎగబెడితే ఏమిటి.. లగ్జరీ లైఫ్ అంటే తనదే అని చెప్పవచ్చు . ఫార్ములా వన్, క్రికెట్, ఫుట్బాల్ టీమ్ వంటి ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ ఈవెంట్లలో తాను చేసేటువంటి హడావుడి అంతాఇంతా కాదు. ప్రపంచంలో చాలా అరుదైన వస్తువులుగా చెప్పుకునే మహాత్మాగాంధీ గ్లాసెస్, టిప్పు సుల్తాన్ కత్తిలను తన వశం చేసుకున్నాడు. అతనెవరో ఇప్పటికే మీకు అర్థమపోయి ఉంటుంది. అతనే దేశీయ బ్యాంకులకు వేల కోట్ల అప్పులు ఎగబెట్టి విదేశాల్లో లైఫ్ గడుపుతున్న విజయ్ మాల్యా.అతడి లగ్జరీ లైఫ్ ఇదే అనుకున్నారా? . లండన్ లో తనకున్న ఇంట్లో బంగారు టాయిలెట్ను మాల్యా కలిగి ఉన్నారని రిపోర్టులు వస్తున్నాయి. ఈ విషయం అందరిని ఆశ్చర్య పరుస్తున్నాయి .ఒక దిక్కు తన వ్యాపారాలు అన్నీ దెబ్బతింటున్నా మరోవైపు ఇండియా అథారిటీలు మాల్యాని ఎలాగైనా ఇండియాకి తీసుకొచ్చి జైలులో వేయాలని ప్రయత్నిస్తున్నా.. తాను మాత్రం లండన్ లో లగ్జరీ జీవితం బాగా గడుపుతున్నట్టు అర్తహమ్ అవుతుంది
. ఈ ఇంట్లో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన లగ్జరీ వస్తువులున్నట్టు రిపోర్టు తెలిపింది. రచయిత జేమ్స్ క్రాబ్ట్రీకి ఒకసారి విజయ్ మాల్యా ఇంటికి వెళ్లే అవకాశం వచ్చినప్పుడు, మాల్యా ఇంట్లో ఉన్నటువంటి గోల్డెన్ టాయిలెట్ను చూశారని తాజా రిపోర్టు పేర్కొంది. జేమ్స్, లీ కౌన్ యూ స్కూల్ అసోసియేట్ ప్రొఫెసర్. ఈ విషయాన్ని జేమ్స్ ఈ వారంలో ముంబైలో జరిగిన ఓ ఈవెంట్లో కూడా తెలియజేసారని రిపోర్టు వెల్లడించింది.
లండన్లోని రీజెంట్స్ పార్క్లో ఉన్న మాల్యా ఇంటిని తాను చూశానని , ఆ భవంతిని, దానిలో ఉన్న లగ్జరీ వస్తువులను చూసిన తర్వాత తాను ఒక్కసారిగా ఈ ప్రపంచాన్నే మర్చిపోయాను అని జేమ్స్ తెలియజేసారు . అక్కడే బంగారు రిమ్తో ఉన్నటువంటి బంగారంతో చేసిన టాయిలెట్ చూశానని చెప్పారు . కాగా ఆ బిల్డింగ్ లో బంగారు టాయిలెట్ ఉన్నప్పటికీ, బంగారు టాయిలెట్ కాగితం లేదు అన్నారు. ఈ విధంగా విజయ్ మాల్యా గోల్డెన్ టాయిలెట్ విషయం బయటకి వచ్చింది.