ఫిట్‌నెస్‌ ట్రైనర్‌గా వచ్చి వివాహేతర సంబంధం
Spread the love

ఫిట్‌నెస్‌ ట్రైనర్‌గా వచ్చిన వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకోవడమే కాకుండా మోసానికి పాల్పడిందంటూ భార్యపై భర్త ఫిర్యాదు చేసిన సంఘటన బంజారాహిల్స్‌ ఠాణా పరిధిలో చోటుచేసుకొంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. రామానాయుడు కలర్‌ ల్యాబ్స్‌ సమీపంలోని అపర్ణ సినార్‌వ్యాలీకి చెందిన గోపిశెట్టి శ్రీధర్‌ కువైట్‌లో ‘టీమ్‌ వన్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌’ పేరుతో కంపెనీ నిర్వహిస్తున్నాడు. అతడికి ఇద్దరు కుమార్తెలు. ఇటీవల ఆయన భార్య ఇంట్లోనే వ్యాయామం చేసుకునేందుకు బోయిని రాకేష్‌కుమార్‌యాదవ్‌ అనే వ్యక్తిని ఫిట్‌నెస్‌ ట్రైనర్‌గా నియమించుకుంది. రాకేష్‌ ప్రతిరోజూ ఉదయం రెండు గంటల పాటు వారి ఇంటికి వచ్చి వ్యాయామం చేయించేవాడు. ఇదే క్రమంలో వారి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. దీనిని గుర్తించిన పనిమనుషులు, డ్రైవర్లు శ్రీధర్‌ దృష్టికి తీసుకొచ్చారు. శ్రీధర్‌ వారికి వార్నింగ్‌ ఇచ్చినా తీరు మార్చుకోలేదు. గత రెండు నెలలుగా అతను కువైట్‌లో ఉండగా రాకేష్‌ పూర్తిగా ఆయన ఇంట్లోనే ఉంటూ భార్యతో గడుపుతున్నట్లు తెలుసుకున్నాడు. రెండు రోజుల క్రితం ఇంటికి వచ్చిన శ్రీధర్‌ వారిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని బయటికి గెంటేశాడు. దీనికితోడు వారిద్దరూ కలిసి ‘సురాస్‌’ పేరుతో ఓ నిర్మాణ సంస్థను ప్రారంభించారు. తనను మోసం చేయడమే కాకుండా వారిద్దరితో తనకు ప్రాణహాని ఉందని శ్రీధర్‌ ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. శ్రీధర్‌ భార్యతో పాటు రాకేష్‌పై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.