భారత్‌ మెరుపు దాడి: 300 మంది ఉగ్రవాదులు హతం
Spread the love

పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో భారత్‌ మంగళవారం తెల్లవారుజామున మెరుపు దాడులు చేసింది . 12 మిరాజ్‌-2000 యుద్ద విమానాలతో దాడులు చేసిన ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ పాక్‌ ఉగ్ర సంస్థలకు చెందిన కంట్రోల్‌ రూమ్‌లను వెయ్యి కేజీల బాంబులతో ధ్వంసం చేశాయి. ఈ దాడుల్లో దాదాపు 300 మంది ఉగ్రవాదులు హతమైనట్టు తెలుస్తోంది.ఈ దాడులను ధృవీకరించిన పాక్‌ తమ బలగాలు దాడులను తిప్పికొట్టాయని ప్రకటించింది.

ఈ దాడులపై ప్రధాని నరేంద్ర మోదీ అత్యవసర సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. ఆర్థిక, రక్షణ శాఖతో ఆయన చర్చిస్తున్నారు. ఇక వాయుసేన దాడుల గురించి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ ప్రధానికి వివరించారు. మరోవైపు సరిహద్దు ప్రాంతాల్లో హై అలర్ట్‌ ప్రకటించింది.

కాంగ్రెస్‌ పార్టీ అధినేత రాహుల్‌ గాంధీ భారత వైమానికి దళానికి సెల్యూట్‌ అంటూ ట్వీట్‌ చేశారు.భారత వైమానిక మెరుపు దాడులపై యావత్‌ భారత్‌ హర్షం వ్యక్తం చేస్తోంది. సర్జికల్‌ స్ట్రైక్‌-2తో భారత వాయుసేన.. పుల్వామా ఉగ్రదాడిలో వీరమరణం పొందిన జవాన్లకు ఘన నివాళులర్పించింది.