పెట్రోల్ కి ప్రత్యామ్నాయంగా ఆల్కహాల్  వెల్లడించిన నితిన్ గడ్కారి
Spread the love

ఇండియా లో  పెట్రోల్ ధరలు రోజురోజుకూ భారీగా పెరిగిపోతున్నాయి. మరికొన్ని రోజుల్లో లీటర్ పెట్రోల్ ధర సెంచరీ  కొడుతుంది  ఈ నేపథ్యంలో పెట్రోల్‌కు ప్రత్యామ్నాయంగా ఆల్కహాల్ (ఇథనాల్‌)ను ఉపయోగించండి. తద్వారా దేశ ఆర్థికాభివృద్ధికి దోహదపడండి అంటూ కేంద్ర జాతీయ రహదారులు, ఉపరితల రవాణా శాఖామంత్రి నితిన్ గడ్కరీ  వెల్లడించారు

ఇటీవల బస్తి రింగ్ రోడ్డు నిర్మాత పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పెట్రోల్‌కు ప్రత్యామ్నాయ వనరులను సమకూర్చుకునే దిశగా బీజేపీ ప్రభుత్వం ప్రయత్నాలు  వేస్తోందన్నారు. అంటే పెట్రోల్ స్థానంలో ఇథనాల్‌ను వాహనాలకు ఇంధనంగా వినియోగించవచ్చని, దీన్ని తమ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని ప్రకటించారు

రోజు రోజుకి  పెరుగుతున్న పెట్రోల్ వినియోగాన్ని తగ్గించేందుకు, ప్రత్యామ్నాయ ఇంధనంగా ఇథనాల్‌ను ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలోని బీజేపీ సర్కారు ప్రోత్సహిస్తుందని  చెప్పారు . ఇథనాల్‌తో మోటార్ బైకులు, బసులు, ఆటోరిక్షాలు నడుస్తాయని తెలిపారు.

చెరకు నుంచి ఇథనాల్‌ను చక్కెర కర్మాగారాలు ఉత్పత్తి చేస్తాయన్నారు. దీన్ని ఇంధనంగా వాడడం  వల్ల పెట్రోల్, డీజిల్ వాడకం తగ్గుతుందని, అది దేశ ఆర్థికాభివృద్ధికి ఉపయోగ పడుతుంది అన్నారు . అదేసమయంలో ఇథనాల్‌ను అధిక మోతాదులో ఉత్పత్తి చేయడం వల్ల చెరకు పండించే రైతులు కూడా అధిక మొత్తంలో గిట్టుబాటు ధరను పొందవచ్చని చెప్పారు