ఎన్నికల బందోబస్తుకు ఏపీ పోలీసులు వద్దు !
Spread the love

సాధారణంగా ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతుంటే పొరుగు రాష్ట్రాల నుంచి పోలీసులను బందోబస్తుకు పిలిపించడం జరుగుతుంది. కానీ ఎపి పోలీసులను తెలంగాణలో బందోబస్తుకు పిలిపించకూడదని నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ సోమవారం చెప్పారు. ఓటర్లను ఏపీ పోలీసులు ప్రలోభపెడుతున్నారనే ఫిర్యాదుల నేపథ్యంలో ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగటానికి అవసరమైతే కేంద్ర సాయుధ బలగాలను రంగంలోకి దింపాలని భావిస్తోంది. అయితే ఓ ఘటన ఎన్నికల సంఘం తాజా నిర్ణయానికి కారణమని తెలుస్తోంది.

జగిత్యాల జిల్లా ధర్మపురిలో కొన్ని రోజుల క్రితం ఏపీ ఇంటెలిజెన్స్‌ పోలీసులు డబ్బులు పంచుతూ పట్టుబడ్డారంటూ టీఆర్‌ఎస్‌ నేతలు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి రజత్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనను సీరియ్‌సగా తీసుకున్న ఈసీ తెలంగాణలో ఏపీ నిఘా వర్గాల సంచారం, ఓటర్లను ప్రలోభపెట్టడంపై పూర్తిస్థాయి వివరణ ఇవ్వాలని ఏపీ డీజీపీని ఆదేశించింది. ఇప్పటి వరకు వారి నుంచి ఎలాంటి వివరణ రాలేదు. ఈ నేపథ్యంలో ఏపీ పోలీసు బలగాలను తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వినియోగించకూడదని ఈసీ నిర్ణయించింది. తెలంగాణ పోలీసులు 70వేల మందితో పాటు తమిళ నాడు, కర్నాటక, కేరళ, మహారాష్ట్ర ,ఒరిస్సా రాష్టాల నుంచి 25వేలమంది బలగాలను బందోబస్తుకు వినియోగిస్తున్నారు.

శాంతిభద్రతలు రాష్ట్ర సర్కార్ చూసుకుంటుందని ఎన్నికలకు సంబంధించింది మాత్రమే ఈసీ చూసుకుంటుందన్నారు.ఎన్నికల బందోబస్తు, లిక్కర్ ,నగదు పంపిణీ, నేరస్తుల బైండో వర్,ఆయుధాల స్వాధీనం, ఈవి ఎంల భద్రత వంటి అంశాల మా త్రమే ఈసీ అధీనంలో ఉంటా యని వివరించారు. రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో ఆదాయ వ్యయాలపై పరిశీలకుని నియమిస్తామని, 53మంది పరిశీలకులను కేటాయించా ల్సిందిగా ఈసీ కోరామన్నారు. రాష్ట్రంలో ఎలాంటి పొలిటికల్‌ ఫోన్‌ ట్యాపింగ్‌ చేయడం లేదని తెలంగాణ డీజీపి మహేందర్ రెడ్డి రజత్‌కుమార్‌కు వివరణ ఇచ్చారు. వాహనాల తనిఖీలోనూ పక్షపాతం చూపడం లేదని చెప్పారు.