చిరు హీరోగా మరో భారీ ప్రాజెక్ట్‌
Spread the love

ఖైదీ నంబర్‌ 150 సినిమాతో గ్రాండ్‌గా రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరం‍జీవి ప్రస్తుతం ప్రస్తుతం ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న హిస్టారికల్‌ ప్రాజెక్ట్‌ సైరా నరసింహారెడ్డిలో నటిస్తున్నాడు. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా తరువాత స్టార్ డైరెక్టర్‌ కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు ఓకె చెప్పాడు చిరు.

తాజాగా మరో విజువల్ వండర్‌కు మెగాస్టార్‌ రెడీ అవుతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. భారీ చిత్రాల దర్శకుడు శంకర్‌ దర్శకత్వంలో మెగాస్టార్ హీరోగా ఓ సినిమా ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతం కమల్‌ హాసన్‌ హీరోగా ఇండియన్‌ 2 తెరకెక్కిస్తున్న శంకర్‌, ఆ సినిమా తరువాత మెగాస్టార్‌ చిరంజీవితో సినిమా చేసే అవకాశం ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. చిరు ఇమేజ్‌కు శంకర్‌ లాంటి దర్శకుడు తోడైతే సంచలనాలు నమోదవుతాయంటున్నారు ఫ్యాన్స్‌.