దీపికా-రణవీర్ ల పెళ్లి ముహూర్తం ఫిక్స్ అయ్యింది!
Spread the love

బాలీవుడ్‌ ప్రేమ జంట దీపిక పదుకోన్, రణవీర్ సింగ్ కొంత కాలంగా ప్రేమలో మునిగి తేలుతున్న సంగతి తెలిసిందే. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న ఈ జంట ఆ వేడుక ఎప్పుడు జరుగుతుందనే విషయమై సస్పెన్స్ కొనసాగిస్తూ వచ్చారు. అయితే ఎట్టకేలకు వివాహ తేదీని ప్రకటించారు. ఈ విషయాన్ని దీపికా, రణవీర్‌ సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించారు. ‘‘ఇరు కుటుంబాల పెద్దలు, ఆత్మీయుల ఆశీస్సులతో వచ్చే నెల 14, 15న మేమిద్దరం ఒకటి కాబోతున్నాం’ అని చెప్పడం చాలా ఆనందంగా ఉంది. ఇంతకాలం మీరు మాపై కురిపించిన ప్రేమకు ధన్యవాదాలు. ప్రేమ, స్నేహం , నమ్మకంతో మేమిద్దరం చెయ్యబోతున్న కొత్త ప్రయాణానికి మీ అందరి ఆశీర్వాదం కావాలి. ప్రేమతో మీ దీపిక, రణ్‌వీర్‌’’ అని రాసి ఉన్న ఇన్విటేషన్‌ను ట్విట్టర్‌లో షేర్‌ చేసిందీ జంట. అయితే పెళ్లి వేడుక ఎక్కడ జరుగుతుందనే విషయాన్ని దీపిక-రణవీర్ వెల్లడించలేదు. అయితే వీరి వివాహం ఇటలీలోని లేక్ కోమోలో జరుగబోతోందని కొంతకాలంగా బాలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అభిషేక్‌బచ్చన్‌, అలియాభట్‌, కృతిసనన్‌, కరణ్‌జోహార్‌, జాక్వలైన్‌ ఫెర్నాండెజ్‌ వంటి స్టార్‌లతోపాటు అభిమానులు కూడా సోషల్‌ మీడియాలో శుభాకాంక్షల వర్షం కురిపించారు.