చిత్రలహరిపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ: స్వయంకృషితో ముందుకెళ్తే…
Spread the love

సాయిధరమ్ తేజ్, కల్యాణి ప్రియదర్శిని, నివేథా పేతురాజ్ నటించిన చిత్రలహరి తొలి ఆట నుంచి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొంటున్నది. కిషోర్ తిరుమల దర్శకత్వం వహించిన చిత్రంలో సునీల్, పోసాని కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఏప్రిల్ 12న విడుదలై మంచి టాక్‌ను సొంతం చేసుకొన్నది. అన్నివర్గాల ప్రేక్షకులు ప్రశంసలు కురిపిస్తున్న క్రమంలో మెగాస్టార్ చిరంజీవి తన స్పందనను వ్యక్తం చేశారు. ఆయన ఏమన్నారంటే..

చిత్రలహరి సినిమా కథ ఏంటంటే..

చిత్రలహరి సినిమా కథ విషయానికి వస్తే, కుటుంబ బాంధవ్యాలు, తండ్రి కొడుకుల అనుబంధాల గురించి చక్కగా తెరకెక్కించారు. ఈ చిత్రంలో యువతకు చక్కటి మెసేజ్ ఉంది. ఎలాంటి ఒడిదుడుకులు, ప్రతికూల పరిస్థితులు తారసపడినా.. అనుకొన్న లక్ష్యాన్ని చేరుకోవడానికి, అనుకొన్నది సాధించడానికి కృషితో ముందుకెళ్తే సాధించలేనిదేదీ లేదు చక్కగా చెప్పిన చిత్రం.

సాయిధరమ్ తేజ్ పరిణితో కూడిన నటన

దర్శకుడు కిపోర్ తిరుమల చక్కటి మేసేజ్‌తో ఆద్యంతం చక్కగా చూపించి దర్శకత్వ ప్రతిభను చాటుకొన్నారు. సాయి తేజ్ కూడా పరిణితితో కూడిన నటనతో ఆకట్టుకొన్నాడు. ఈ చిత్రంలో పోసాని, సునీల్, ఇతర నటీనటులు నిండుదనం కలుగుజేశారు.

సక్సెస్‌కు కేరాఫ్ అడ్రస్ మైత్రీ

దేవీ శ్రీ ప్రసాద్ మరోసారి తన టాలెంట్‌ను చూపించాడు. పాటలు, రీరికార్డింగ్‌తో ఆకట్టుకొన్నాడు. మైత్రీ మూవీస్ మేకర్స్ విజయాలకు కేరాఫ్ అడ్రస్. నిర్మాతలు నవీన్, రవిశంకర్, మోహన్‌ మళ్లీ చక్కటి చిత్రాన్ని అందించారు. ఈ సినిమాతో వాళ్ల ప్రతిష్టను మరోసారి నిలబెట్టుకొన్నారు.

ప్రతీ ఒక్కరు చూడదగిన చిత్రం

చిత్రలహరి సినిమా విజయానికి కారణమైన ప్రతీ ఒక్కరికి, చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు. వేసవి సెలవుల్లో విడుదలైన ఈ చిత్రం ప్రతీ ఒక్కరు చూడదగిన చిత్రం అని చిరంజీవి అన్నారు. ఏప్రిల్ 12న రిలీజైన ఈ చిత్రం అన్ని వర్గాలను ఆకట్టుకొంటున్న నేపథ్యంలో చిరంజీవి పై విధంగా స్పందించారు.