‘ఎందుకీ రహస్య కలయిక అని ప్రశ్నించాను?’ : చిన్మయి తల్లి
Spread the love

ప్రముఖ గాయని చిన్మయి సినీ పరిశ్రమలో ఎదుర్కొన్న లైంగిక వేధింపులపై ఆమె తల్లి పద్మాసిని తొలిసారి స్పందించారు. ఓ టీవీ చానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆమె, తన ముందే తన కూతురిని వైరముత్తు గదిలోకి పిలిచాడని ఆరోపించారు. 2004లో ఒక సినిమా ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం కోసం స్విట్జర్లాడ్‌కు వెళ్లాం. కార్యక్రమం పూర్తి కాగానే నిర్వాహకులు అందరిని తిరిగి పంపించేస్తున్నారు. మమల్ని మాత్రం అక్కడే ఉండమన్నారు. అక్కడ వైరముత్తు కూడా ఉన్నట్లు తెలిసింది. ఇంతలో ఒక వ్యక్తి వచ్చి అమ్మా మీరు ఇక్కడే వేచి ఉండండి. చిన్మయి కోసం వైరముత్తు హోటల్‌ రూమ్‌లో వెయిట్‌ చేస్తున్నారు ఆమెను రమ్మన్నారు అని చెప్పాడు. హోటల్‌కు చిన్మయి ఎందుకు ఒంటరిగా వెళ్లాలి. ఏదైనా వృత్తి పరమైన విషయాలు మాట్లాడాలంటే ఊరికు వెళ్లిన తరువాత చూసుకోవచ్చు. ఎందుకీ రహస్య కలయిక అని అడిగాను. అందుకు అతను వైరముత్తుకు కాస్త సహకరించండి అని బహిరంగంగానే అన్నాడు.అందుకు వేరేవారిని చూసుకోండి అని చెప్పి మేము అక్కడి నుంచి వచ్చేశాం. మీటూ సంఘానికి చిన్మయి మద్దతుగా నిలిచారు. ఇది మహా సంఘంగా మారాలి. ఇప్పుడిప్పుడే అందరూ దీని గురించి మాట్లడటం మొదలెట్టారు. పాడైపోతున్న ఈ సమాజానికి అవగాహన కలగాలి’ అని అన్నారు.