చైనాకు షాకిచ్చిన ట్రంప్…
Spread the love

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిపోతున్నారు. తాజాగా మరో సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు.ఎంతటివారి ఫైన అయినా  విరుచుకుపడే ట్రంప్ తాజాగా చైనా మొబైల్ సర్వీసులపై నిషేధాన్ని విధించటం ఎవ్వరు ఊహించని రీతిలో షాక్ ఇచ్చింది.ఆయన తీసుకున్న నిర్ణయంతో అమెరికాలో చైనా మొబైల్ సర్వీసులు అన్ని ఆగిపోయాయి.

అమెరికా టెలి కమ్యునికేషన్ మార్కెట్ చైనా మొబైల్ సర్వీసులని ఆఫర్ చేస్తున్న కొన్ని సంస్థల పై నిషేధం విధించినట్లు అయ్యింది.ఈ నిర్ణయం తో  చైనా మొబైల్ ను అమెరికా లో ఉపయోగించడానికి వీలు లేకుండా పోయింది. నేషనల్ టెలి కమ్యునికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ అడ్మినిస్ట్రేషన్ విడుదల చేసిన ఒక  ప్రకటన లో ఫెడరల్ కమ్యునికేషన్స్ కమిషన్ కు చైనా మొబైల్ ను అనుమతించకూడదన్న సూచన ఇచ్చింది

గడిచిన కొద్ది నెలలు గా చైనా మరియు అమెరికాల మధ్య వాణిజ్య యుద్ధం ఓ రేంజ్ లో కోనసాగుతోంది. డొనాల్డ్ ట్రంప్ విధించిన చైనా మొబైల్ సర్వీసుల నిషేధంతో ప్రపంచంవ్యాప్తంగా అత్యున్నత కంపెనీల లో  ఒకటైన చైనా మొబైల్ సంస్థ భారీ గా ఎదురుదెబ్బ తగిలి౦దనే చెప్పాలి.చైనా టెక్నాలజి కంపెనీ లు తమ మేథోసంపత్తి హక్కుల ని  దొంగలిస్తున్నాయని ట్రంప్ ఆ కంపెనీల ఫై తీవ్ర విమర్శలు చేయటం విధితమే.

తాజా విధించిన నిషేధం పై వివరణ ఇస్తూ అమెరికా భద్రత కు ముప్పు అన్న విషయాన్ని అమెరికా అథారిటీలు వెల్లడిస్తున్నాయి. చైనా మొబైల్ దోపిడీకి దారి తీసే అవకాశం ఎంతైనా ఉందని ఆ సంస్థ చైనా ప్రభుత్వ ఆధీనంలో  నడుస్తోందని చెబుతున్నారు.చైనా మొబైల్ ప్రాముఖ్యత పెరిగితే అమెరికా న్యాయవ్యవస్థ కు ప్రమాదాలు కూడా  పెరుగుతాయని దేశ ప్రయోజనాలని  కాపాడుకోవడ౦ అసాధ్యం అని  అమెరికా కామర్స్ కమ్యూనికేషన్స్ కు చెందిన ప్రముఖ  అధికారి డేవిడ్ రెడ్ల్ చెప్పటం విశేషం.తాజాగా జరుగుతున్న పరిణామాలపై బీజింగ్ ఎలా స్పందిస్తుంది అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది.