హెచ్‌-1బీ వీసాదారులకు ట్రంప్‌ షాకింగ్ న్యూస్…
Spread the love

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మొదలైన కష్టాలు హెచ్‌-1బీ వీసాదారులను ఇంకా వీడటం లేదు. కొత్త కొత్త నిబంధనలతో హెచ్‌-1బీ వీసాదారులకు ట్రంప్‌ షాకిస్తూనే ఉన్నారు. తాజాగా అమెరికా మరో కొత్త రూల్‌ తీసుకొచ్చి హెచ్‌-1బీ వీసాదారులకు దడ పుట్టిస్తుంది. వీసా గడువు పొడగింపు లేదా స్టేటస్‌ మార్చుకోవడం తిరస్కరణకు గురైతే, హెచ్‌-1బీ వీసాదారులు దేశ బహిష్కరణ విచారణలను ఎదుర్కొనే ఈ కొత్త రూల్‌ వీసా దారులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తుంది. అమెరికా అథారిటీలు ఇచ్చే గడువు ముగిసినా కూడా ఇదే రకమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని వెల్లడైంది.

హెచ్‌-1బీ వీసాపై అమెరికాకి వెళ్లిన నిపుణులు.. వీసా గడువు పెంచుకోవడానికి పెట్టుకున్న దరఖాస్తు లేదా అభ్యర్థనలు తిరస్కరణకు గురైతే సదరు వ్యక్తులు దేశం విడిచి వెళ్లాల్సి ఉంటుంది. వీసా గడువు తీరిన తర్వాత సగటున 240రోజులు మాత్రమే అక్కడ ఉండటానికి అనుమతి ఉంది. ఆలోపు వీసా గడువు పెంపు దరఖాస్తు తిరస్కరణకు గురైతే వెంటనే దేశం వదిలి వెళ్లిపోవాలి. అలాకాకుండా అనధికారికంగా అక్కడే నివసించే వాళ్లకి యూఎస్‌ సిటిజన్‌షిప్ అండ్‌ ఇమ్మిగ్రేషన్‌ సర్వీస్‌‘నోటీస్‌ టు అప్పియర్‌ జారీ చేస్తుంది. ఇది జారీ చేసిన అనంతరం సదరు ఉద్యోగులు ఉద్యోగంలో కొనసాగడానికి వీలుండదు. దీనిపై విచారణ జరిగే వరకు మాత్రమే అమెరికాలో ఉండటానికి అవకాశం ఉంటుంది. దీని ప్రకారం వీసా గడువు తీరిన వ్యక్తి ఇమ్మిగ్రేషన్‌ న్యాయమూర్తి ముందు హాజరు కావాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ సమయంలో సదరు వ్యక్తి అమెరికాలో లేనట్లయితే అతనిపై గరిష్ఠంగా ఐదేళ్ల పాటు అమెరికాలోకి రాకుండా నిషేధం విధిస్తారు. వీసా గడువు పెంపు దరఖాస్తు తిరస్కరణకు గురయ్యాక కూడా ఏడాది పాటు అమెరికాలో అనధికారికంగా నివసిస్తే వారిపై పదేళ్లపాటు నిషేధం అమలు చేస్తారు.

హెచ్‌1బీ వీసాలు 240 రోజుల‌కు ఇస్తుంటారు. వీసా ముగుస్తున్న స‌మ‌యంలో ఉద్యోగి త‌ర‌ఫున కంపెనీ ద‌ర‌ఖాస్తు చేసేది. గ‌డువును అమెరికా అధికారులు తిర‌స్కరిస్తే వెంట‌నే స‌ద‌రు ఉద్యోగి తిరిగి స్వదేశానికి వ‌చ్చేస్తారు. కంపెనీ మ‌ళ్ళీ ద‌ర‌ఖాస్తు చేసి వీసా వ‌స్తే  తిరిగి అమెరికా వెళ్ళేవారు. కాని ఇప్పుడు ఈ నిబంధనలను మరింత కఠనం చేస్తున్నారు.