‘బాహుబ‌లి’ రికార్డులను తిర‌గ‌రాస్తున్న ‘అర‌వింద స‌మేత‌’
Spread the love

ఒక్క‌సారి స్టార్ ఇమేజ్ వ‌స్తే చాలు … కెరీర్ పూల‌దారే ఇంక‌. ఇప్పుడు మ‌న స్టార్ హీరోల‌ను చూసి కుర్ర హీరోలు ఫీల్ అవుతున్న‌ది ఇదే. దీనికి కొన్ని సాక్ష్యాలు కూడా కంటిముందు క‌నిపిస్తున్నాయి. ఎన్టీఆర్ సినిమానే తీసుకోండి.. ఈయ‌న న‌టిస్తున్న “అర‌వింద స‌మేత” బిజినెస్ చూస్తుంటే క‌ళ్లు బైర్లు కమ్మడం ఖాయం. త్రివిక్ర‌మ్ తెర‌కెక్కిస్తోన్న ఈ చిత్రం పై అంచ‌నాలు ఆకాశ‌మంత ఉన్నాయి. ఈయ‌న గ‌త సినిమా “అజ్ఞాతవాసి” డిజాస్ట‌ర్. ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా వ‌చ్చిన ఈ చిత్రం సంక్రాంతి సినిమాల్లోనే కాదు.. ఇండియాలోనే టాప్ 5 డిజాస్ట‌ర్స్ లో ఒక‌టిగా నిలిచింది. ఇలాంటి స‌మ‌యంలో ఎన్టీఆర్ సినిమాను కేవ‌లం ఆరు నెలల్లోనే పూర్తి చేసాడు. అక్టోబ‌ర్ 11న ఈ చిత్రం విడుద‌ల కానుంది. ప్రస్తుతం ఎన్టీఆర్ వ‌ర‌స విజ‌యాల్లో ఉన్నాడు. “టెంప‌ర్”.. “నాన్న‌కు ప్రేమ‌తో”.. “జ‌న‌తాగ్యారేజ్”.. “జై ల‌వ‌కుశ” సినిమాల‌తో ఎన్టీఆర్ న‌టుడిగానే కాకుండా హీరోగా కూడా మ‌రో మెట్టు పైకి ఎక్కాడు. విదేశాల్లో.. ముఖ్యంగా ఆస్ట్రేలియాలో ఇప్ప‌టి వ‌ర‌కు ఏ తెలుగు సినిమా విడుద‌ల చేయ‌ని స్థాయిలో ‘అర‌వింద స‌మేత‌’ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ‘బాహుబ‌లి’ కంటే భారీగా అక్క‌డ విడుద‌ల‌వుతుంది.