అనసూయ ఒంటిపై ఉన్న టాటూ అర్థం ఏమిటంటే ?
Spread the love

ఇటు బుల్లితెరపై యాంకర్‌గా.. అటు వెండితెరపై నటిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు అనసూయ. న్యూఇయర్ సందర్భంగా అనసూయ తన అభిమానులతో ట్విట్టర్ చాట్ చేశారు. ఈ సందర్భంగా వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. అనసూయను చూడగానే చాలా మందికి ఆమె వేయించుకున్న టాటూ వైపు దృష్టి వెళుతుంది. ఆమె ఆ టాటూ ఎందుకు వేయించుకున్నారు? దాని అర్థం ఏమిటనే ప్రశ్నలు మైండ్‌లోకి వస్తాయి. అయితే ఈ ప్రశ్నలకు తాజాగా సమాధానం దొరికింది. తన ఒంటిపై ఉన్న టాటూ అర్థం ఏమిటి? ఫస్ట్ సాలరీ ఎంత? ఇలా పలు అంశాలపై ఆమె స్పందించారు. ఓ అభిమాని తన వృత్తిపై నెగెటివ్ కామెంట్స్ చేయడంతో…. అనసూయ తనదైన శైలిలో రిప్లై ఇచ్చారు. నేను చేస్తున్న పని విషయంలో గర్వంగా, సంతోషంగా ఉన్నట్లు వెల్లడించారు. మీరు వేయించుకున్న టాటూ అర్థం ఏమిటి? అనే ప్రశ్నకు అనసూయ స్పందిస్తూ…. ఆ టాటూ అర్థం ‘నిక్కూ’, అది మా ఆయన పెట్ నేమ్ అని తెలిపారు. మీరు అందుకున్న ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంత అనే ప్రశ్నకు అనసూయ రిప్లై ఇస్తూ…… రూ. 5,500 అని తెలిపారు. తర్వాతి చిత్రం ఏంటి? అనే ప్రశ్నకు అనసూయ స్పందిస్తూ… ‘f2’ జనవరి 12న రాబోతోంది. ఇందులో చిన్న పాత్రలో నటించా. ‘యాత్ర’ ఫిబ్రవరి 8న విడుదల కాబోతోంది. ఇందులోనూ చిన్న పాత్రే.. కానీ మంచి స్పందన వస్తుంది. ‘కథనం’ వేసవిలో రాబోతోంది.