ఆ వీడియో చూసి అనసూయను ట్రోల్‌ చేస్తోన్న నెటిజన్లు…
Spread the love

యాంకర్ అనసూయ “రంగ‌స్థ‌లం” సినిమాలో రంగ‌మ్మ‌త్త‌గా అద‌ర‌గొట్టి మొన్న‌టి వ‌ర‌కు ఆ సినిమా ఇచ్చిన ఫేమ్‌తో హాయిగా ఎంజాయ్ చేసింది. మొద‌ట్లో ఆమెని ట్విట్ట‌ర్‌లో జ‌నం తెగ ట్రోల్ చేసేవారు. చీటికిమాటికి ఆమె ర‌క‌ర‌కాల కామెంట్స్ చేస్తూ ఉండేది. దాంతో జ‌నం కూడా వైల్డ్‌గా రియాక్ట్ అయ్యేవాళ్లు. ఐతే రంగ‌స్థ‌లం సినిమా త‌ర్వాత ఆమె అస్స‌లు నెటిజెన్ల నుంచి నెగిటివ్ కామెంట్ల‌ను అందుకోలేదు. చాలా గ్యాప్ త‌ర్వాత మ‌ళ్లీ ఆమెకి ఆ అనుభ‌వం ఎదురైంది. ఈ సారి ఆమె ట్రోలింగ్‌ గురి కావ‌డానికి రీజ‌న్‌..ఒక యాడ్‌. ఒక క్లాత్ స్టోర్ యాడ్‌లో న‌టించి ట్రోలింగ్‌ని ఎదుర్కొంటోంది. మాయాజబార్ మూవీలోని ‘అహనా పెళ్లంట’ థీమ్‌తో ఈ యాడ్ డిజైన్ చేశారు. సావిత్రి తరహాలో అనసూయ డాస్స్ చేస్తూ, ఆవిడలా హావ భావాలు పలికించే ప్రయత్నం చేసింది. అయితే ఇది కొంద‌రికి రుచించ‌లేదు. ఇటీవ‌లే కీర్తి సురేష్‌ని సావిత్రిలా చూసిన క‌ళ్ల‌తో అన‌సూయ‌ని చూడలేక‌పోతున్నామంటూ వారు ఆమెపై కామెంట్స్ మొదలుపెట్టారు. ‘సావిత్రి గారితో నీకు పోలికా? సావిత్రమ్మని ఇలాంటి పనులకు ఉపయోగించుకోకండి’.. అంటూ ఆమెని ఓ రేంజ్‌లో ఆడుకుంటున్నారు నెటిజ‌న్లు.