కోటీశ్వరుడైన బాయ్‌ఫ్రెండ్‌తో అమీ జాక్సన్‌ నిశ్చితార్థం…!
Spread the love

బ్రిటిష్ బ్యూటీ అమీ జాక్సన్‌ నిశ్చితార్థం అట్టహాసంగా జరిగింది..ఇప్పటివరకు హాట్ హాట్ అందాల ప్రదర్శనతో అభిమానులను, నెటిజన్లను ఆకట్టుకుంటూ వస్తున్న ఈ హాట్ బ్యూటీ త్వరలో ఓ ఇంటిది కాబోతుంది. బ్రిటన్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త జార్జ్‌ పనాయొటో తో కొంతకాలంగా డేటింగ్‌ ఉన్న అమీ.. న్యూఇయర్‌ సందర్భంగా జాంబియాలో వీరిద్దరూ నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ విషయాన్ని అమీ ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా తెలిపింది. ‘1 జనవరి 2019.. మన జీవితాల్లో కొత్త ప్రయాణం. ఐ లవ్యూ. నన్ను ఎల్లప్పుడూ సంతోషంగా ఉంచుతున్నందుకు ధన్యవాదాలు’ అని పేర్కొంటూ ఫొటోను పోస్ట్‌ చేసింది. పెళ్లి ఎప్పుడు అనేది మాత్రం వెల్లడించలేదు. అమీ జాక్సన్ పెళ్లాడబోతున్న జార్జ్‌ పనయొటో యూకెలో ధనవంతుడైన బ్రిటిష్ ప్రాపర్టీ డెవలపర్ ఆడ్రియాస్ కుమారుడు. వీరికి యూకెలో చాలా లగ్జరీ హోటల్స్ ఉన్నాయి. జార్జ్‌‌ను ఇంగ్లిష్ మీడియా మల్టీ మిలియనీర్ ప్లేబోయ్ అని సంబోధిస్తుండటం గమనార్హం. తెలుగులో ‘ఎవడు’, ‘అభినేత్రి’ వంటి చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీ తాజాగా రజనీకాంత్ 2.ఓ లో హీరోయిన్ గా నటించి అలరించింది.