అమెజాన్‌  డెలివరీ కి రోబోలు ?
Spread the love

రోబోలు.. కొత్త కొత్త రంగాల్లోకి దూసుకుపోతున్నాయి.ఇప్పుడా అమెజాన్‌ ప్రైమ్‌ డెలివరీలు మనుషులు కాకుండా రోబోలు చేయనున్నాయి. ఇందుకోసం అమెజాన్‌ తన పరిశోధన కేంద్రంలో ప్రత్యేకమైన సెల్ఫ్‌ డ్రైవింగ్‌ డెలివరీ రోబోలను తయారుచేసింది. అంతేకాదు.. త్వరలో 6 స్కౌట్‌ రోబోలు వాషింగ్టన్‌లోని స్నహామిష్‌ కౌంటీలో డెలివరీలు కూడా ప్రారంభిస్తాయని ప్రకటించింది. బ్యాటరీ సాయంతో పనిచేసే ఈ రోబోలు తమంతట తామే అడ్రస్‌కు వెళ్లి.. సరుకులు ఇచ్చి వస్తాయి. ఎవరినీ గుద్దేసే ప్రసక్తే లేదు.. ఎదురుగా ఎవరైనా వస్తే.. సైడిచ్చి మరీ ముందుకెళ్తాయి. అయితే, సదరు వినియోగదారులు అసలైనవారో కాదో అన్న విష యం ఇదె లా నిర్ధరించుకుంటుందన్న వివరాలను మాత్రం అమెజాన్‌ తెలియజేయలేదు.

గతంలో వచ్చిన ఫుడ్‌ డెలివరీ రోబోలో అయితే వినియోగదారులు తమ మొబైల్‌కు వచ్చే.. ఓ ప్రత్యేకమైన కోడ్‌ను రోబో స్క్రీన్‌ మీ ద ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది. తొలి దశలో తమ సిబ్బంది వీటిని పర్యవేక్షిస్తారని.. తదనంతర దశలో ఇవి తమంతట తాము వెళ్లి డెలివరీ చేస్తాయ ని అమెజాన్‌ తెలిపింది. రోబోలే కాదు.. డెలివరీ డ్రోన్‌లను కూడా తాము తయారుచేస్తున్నామని.. తదనంతర దశలో ఉపయోగిస్తామని పేర్కొంది.