‘అమ్మ’ గా ఎవరో.. ఐష్ లేదా అనుష్క?
Spread the love

ప్రస్తుతం టాలీవుడ్ – బాలీవుడ్ – కోలీవుడ్ లలో బయోపిక్ ల హవా నడుస్తోన్న సంగతి తెలిసిందే. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ పై ప్రారంభానికి ముందే కాంపిటీషన్ మొదలైంది. అమ్మ బయోపిక్ ను నిర్మించేందుకు దర్శక నిర్మాతలు పోటీపడుతున్నారు. మరోవైపు – జయలలిత పాత్రలో “అమ్మ”గా మారడానికి ఐశ్వర్యారాయ్ లేదా అనుష్క శెట్టిలలో ఒకరిని ఎంచుకునేందుకు లెజెండరీ దర్శకుడు భారతీ రాజా ప్రయత్నాలు మొదటెట్టారని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మొదలుకాక ముందే అమ్మ బయోపిక్ పై చర్చలు జరుగుతున్నాయి.

తమిళనాడు రాజకీయాలను ప్రభావితం చేసిన శక్తిమంతమైన నాయకురాలిగా జయలలిత ప్రజల మనసులను దోచుకున్నారు. అన్నివర్గాల ప్రజలచేత ఆప్యాయంగా ‘అమ్మ’ అనిపించుకున్నారు. అలాంటి జయలలిత జీవితచరిత్రను రూపొందించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. భారతీరాజా చకచకా తన ప్రాజెక్టుకు సంబంధించిన సన్నాహాలను మొదలుపెట్టినట్టుగా తెలుస్తోంది. జయలలిత బయోపిక్ కోసం ఆయన ఐశ్వర్య రాయ్ ను .. అనుష్కను ఇద్దరినీ సంప్రదిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఐశ్వర్యరాయ్ ఓకే అంటే జాతీయస్థాయిలో ఈ ప్రాజెక్టు అందరి దృష్టిలో పడుతుంది. ఆమె కుదరదంటే మాత్రం అనుష్కను తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారట. ఇక తెలుగు.. తమిళ భాషల్లో అనుష్కకి మంచి క్రేజ్ వుంది. హిందీ ప్రేక్షకులకు కూడా ఆమె సుపరిచితమే. ఇక ఈ సినిమాకి ‘పురిచ్చి తలైవి’.. ‘అమ్మ’ అనే రెండు టైటిల్స్ ను పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. డిసెంబర్లో ఈ సినిమాను లాంచ్ చేసే ఆలోచనలో వున్నట్టుగా సమాచారం.