“విమానం నా భార్య కంటే ఎక్కువ”తన ఆఖరి వీడియో లో పైలట్ మీత్‌ కుమార్
Spread the love

బుధవారం భారత వైమానిక దళానికి చెందిన MIG-21 యుద్ధ విమానం హిమాచల్‌ప్రదేశ్‌లో కుప్పకూలిన ప్రమాదంలో ఒక పైలట్‌ ప్రాణాలు కోల్పోయిన సంగతి విదితమే.పఠాన్‌కోట్‌ వైమానిక స్థావరం నుంచి బుధవారం మధాహ్నం 12.20 ప్రాంతంలో బయల్దేరిన విమానం గంట తర్వాత కాంగ్రా జిల్లా మెహ్రాపాలీ గ్రామం వద్ద కుప్పకూలి౦ది.

ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న స్క్వాడ్రన్‌ పైలట్‌ మీత్‌ కుమార్‌ మృతి చెందారు.కొన్ని రోజుల క్రితం భారత వైమానిక శాఖ “ఎ డేట్‌ విత్‌ యాన్‌ ఎయిర్‌ వారియర్‌”  పేరిట ఓక వీడియోను రికార్డు చేసారు.ఆ వీడియో లో మీత్‌ కుమార్‌ తనకు ఆ విమానం అంటే నా భార్య కంటే ఎక్కువ అని వెల్లడించారు.

మీత్‌ కుమార్ మాటల్లో…“నా పేరు మీత్‌ కుమార్.ఈ నేను స్క్వాడ్రన్‌ పైలట్‌ను.నేను నడుపుతున్న ఈ అందమైన జెట్‌ పేరు MIG-21.ఇది మల్టీ రోల్‌ విమానం.ఎటువంటి మిషన్ల నైనాసరే చేపట్టగలుగుతుంది.హై ల్యాండింగ్‌ స్పీడ్‌కు పెట్టింది పేరు MIG-21 ప్రతీ ల్యాండింగ్‌ భిన్నంగా ఉంటుంది.ఈ విమానంలో 57MM రాకెట్‌ కూడా ఉ౦టుంది.ఒక్కసారే 8 బాంబు లను మోయగల సామర్థ్యం దీనికి ఉంది.ఇందులో ప్రయాణిస్తున్నప్పుడు మనల్ని మనం దైవంలా అనుకుంటాం…ఈ విమానం తో నాకు ఉన్న అను బంధమే వేరు.నా భార్య కంటే ఎక్కువ.నా భార్య తో కన్నా ఈ విమానంతో గడిపిన క్షణాలే ఎక్కువ”అంటూ… మీత్‌ కుమార్‌ ఆ వీడియోలో వెల్లడించారు.ఇలా తనకు ఎంతో ఇష్టమైన ఇదే విమానంలో  మీత్‌ కుమార్‌ ప్రాణాలు పోగొట్టుకోవడం చాలా బాధాకరం.

ఇదిలా ఉంటే మీత్‌ కుమార్‌ విమానం ప్రమాదం సమయంలో సాధారణ పౌరులకు ఎలాంటి ప్రమాదం జరగకుండా మీత్‌ కుమార్‌ తన విమానాన్ని పొలాల్లోకి మళ్లించి ప్రాణాలు వదిలినట్లు పోలీసు అధికారి ఒకరు తెలియజేసారు.మీత్‌ కుమార్‌ మృతి పట్ల హిమాచల్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి జైరామ్‌ ఠాకూర్‌, రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.